​గ్రామవలంటీర్ కి జగనన్న షాక్ 

April 05, 2020

ఏపీ సర్కారులో అత్యంత చిరుద్యోగి అయిన గ్రామ వలంటీర్ కి జగనన్న ప్రభుత్వం గుండె బద్దలయ్యే మాట చెప్పింది. అసలు ఆ ఉద్యోగాలు చేయాలో వద్దో తెలియని అయోమయాన్ని సృష్టించింది. బహుశా దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పెట్టని కండిషన్ పెట్టింది. ఉద్యోగం ఇచ్చేటపుడు ఈ షరతును వెల్లడించలేదు. అపుడు దాచిపెట్టి... ఓ ఉద్యోగి రాజీనామా చేయగా... ఇపుడు బయటపెట్టారు.  ఇంతకీ ఆ షాకింగ్ వార్త ఏంటంటే...
మీరు గ్రామవలంటీర్ అయితే... వేరే ఉద్యోగం కనుక మీకు వస్తే ఏపీ సర్కారు మీకు చుక్కలు చూపిస్తుంది. మీరు ఎపుడు వలంటీర్ ఉద్యోగం మానేయాలని అనుకున్నా... అంతవరకు పెట్టిన మీపై ప్రభుత్వం పెట్టిన ఖర్చును, అప్పటివరకు మీకు ఇచ్చిన అన్ని శాలరీలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటి వాళ్లు పనిచేసి తీసుకునే జీతాన్ని వెనక్కు ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారేమో. అదంతే... జగనన్న ఇచ్చిన ఉద్యోగాన్ని మహా అదృష్టంలా భావించి అలాగే పనిచేస్తుండాలి. దానిని కాదన్నందుకు శిక్ష తప్పదు. తాజాగా  అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గన్నేవారిపల్లి వలంటీర్ కు ఓ రైల్వే ఉద్యోగం వచ్చింది. దీంతో అతను సంబరాలు చేసుకుని పెద్ద ఉద్యోగం వచ్చిందని ఇక సెటిల్ అని అనుకుని ప్రస్తుతం చేస్తున్న వలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికారులు అతనికి ట్విస్ట్ ఇచ్చారు. నీ రాజీనామా ఆమోదించాలంటే... ఇంతవరకు గవర్నమెంటు నీకిచ్చిన శాలరీ మొత్తం కక్కు అనేశారట. ఇదేం రూలు? ఇలా ఎక్కడా ఉండదే అన్నా కూడా వినలేదు. శాలరీ మాత్రమే కాదు అంతకుముందు ట్రైనింగ్ ఇవ్వడానికి పెట్టిన ఖర్చును కూడా తిరిగి ఇవ్వాలని చెప్పారట. దీంతో రైల్వే ఉద్యోగానికి ఎంపికయిన మహేశ్వర్ రెడ్డి లబోదిబోమంటున్నారు. జగన్ గవర్నమెంటు రూలు చూసి ఆ ఉద్యోగం వచ్చిన మహేశ్వర్ రెడ్డే కాదు... ప్రతి గ్రామ వలంటీర్ గజగజ వణుకుతున్నారు. ఇదేం అన్యాయం. ఇపుడు ఈ ఉద్యోగం చేయాలా? వద్దా? చేస్తే భవిష్యత్తులో పనిచేసి ఈ డబ్బంతా ఎలా తిరిగి ఇవ్వగలం. ఒక వేళ ప్రైవేటు ఉద్యోగం వస్తే దానికోసం దీనిని ఇంత కట్టి ఎలా మానేస్తాం. పనిచేయించుకుని డబ్బు తిరిగి ఇవ్వనడం ఏంటి? అంటూ అనేక సందేహాలతో ఏపీ సర్కారు తీరుపై వారు మండిపడుతున్నారు.