Photo: వివేకా అంతిమ యాత్ర‌లో జ‌గ‌న్ న‌వ్వులు !

November 20, 2019

వైఎస్ జ‌గ‌న్ తీరు ఇటీవ‌ల చాలా అనుమానాస్ప‌దంగా ఉంటోంది. కోడి క‌త్తి దాడి జ‌రిగిన‌పుడు హ‌త్య‌య‌త్నం జ‌రిగితే మూడు గంట‌లు ప్ర‌యాణించి హైద‌రాబాదుకు వెళ్లిన‌పుడు చాలా అనుమానాలు క‌లిగాయి. త‌ర్వాత దాన్ని చాలామంది మరిచిపోయారు. తాజాగా బాబాయి చ‌నిపోతే ప‌లుచోట్ల‌ గొడ్డ‌లివేటు చూసిన బంధువుల స‌మాచారం ప్ర‌కారం సాక్షి టీవీలో వైఎస్ వివేకా గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్టు ప్ర‌సారం చేశారు. పోస్టు మార్టం త‌ర్వాత హ‌త్య అంటూ సాక్షి చెప్పింది. సాయంత్రం విజ‌య‌సాయి రెడ్డి, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఇది చంద్ర‌బాబు చేయించిన హ‌త్య‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి చేసిన హ‌త్య అంటూ ఆరోప‌ణ‌లు చేశారు.
తాజాగా అనుమానాస్ప‌ద విష‌యాలు ఏంటంటే... అంత తీవ్ర‌మైన ఘ‌ట‌న పార్టీపెద్ద కుటుంబంలో ప్రెస్‌మీట్ పెట్టిన‌ విజ‌యసాయిరెడ్డి న‌వ్వుతూ ఉల్లాసంగా సెటైర్లు వేస్తూ ఉన్న విష‌యం వీడియోలో రికార్డు అయ్యింది. కొద్ది క్ష‌ణాల త‌ర్వాత మొహం మీద సీరియ‌స్ నెస్ న‌టిస్తూ ఆదినారాయ‌ణ‌రెడ్డి దుర్మార్గుడు అంటూ క‌న్నీరు కార్చారు. స‌రే ఈయ‌న వైఎస్ కుటుంబంలో ఒక‌డు కాదు అనుకుందాం. మ‌రి జ‌గ‌న్ అనే వ్య‌క్తి బాబాయి మ‌ర‌ణానికి మొద‌టి బాధితుడు క‌దా. ఈరోజు అంతిమ యాత్ర ఫొటోలు మ‌ర్డ‌ర్ జ‌రిగిన చోటుకు మొద‌ట వెళ్లి చూసిన అవినాష్ రెడ్డి అఫిషియ‌ల్ ఫేస్‌బుక్ అక్కౌంట్లో ఉన్నాయి. మీరు వెతికి చూడొచ్చు. వివేకా అంతిమ‌యాత్ర‌లో జ‌గ‌న్ మొహంలో విషాద‌మే క‌నిపించ‌డం లేదు. అంతిమ‌యాత్ర ను చూసి ఎవ‌రూ న‌వ్వుతూ ముందుకు సాగ‌రు. కానీ జ‌గ‌న్ మాత్రం... ముందు బాడీని తీసుకుని వెళ్తుండ‌గా... వెనుక న‌వ్వుతూ జ‌నాల‌కు అభివాదం చేస్తూ వెళ్లారు. మ‌రి ఇది అనుమానించాల్సిన ఘ‌ట‌న కాదంటారా?