అక్కడ మంత్రుల కంటే ఆ వైసీపీ లీడర్ పవర్‌ఫుల్లట

May 31, 2020

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడి ఆయన మంత్రివర్గాన్ని ప్రకటించిన తరువాత అందులో ఒకరిద్దరి పేర్లు లేకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలాంటి పేర్లలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. మంగళగిరిలో నారా లోకేశ్‌ను ఓడించిన లీడర్‌గా, అంతకుముందు రాజధాని ఇష్యూలో కేసులు వేసి చంద్రబాబునాయుడిని ముప్పతిప్పలు పెట్టిన నేతగా ఆయనకు కేబినెట్లో బెర్తు దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు జగన్. అయితే, ఆర్నెళ్లు తిరిగే నాటికి గుంటూరు జిల్లాలో మంత్రుల కంటే ఆళ్ల రామకృష్నారెడ్డే పవర్‌ఫుల్‌గా మారారని చెబుతున్నారు. ముఖ్యంగా ఆ జిల్లాలో కలెక్టరు, ఇతర అధికారులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచనలను, సిఫార్సులను మాత్రమే పాటిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఇతర అధికారులు ఆళ్ల మాటకే విలువిస్తున్నారని.. తమను పట్టించుకోవడంలేదని ఆ జిల్లా మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారట. హోంమంత్రి మేకతోటి సుచరిత, మార్కెటింగ్‌ మరియు పశుసంవర్దకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణలు గుంటూరు జిల్లాకే చెందినవారైనప్పటికీ వారి సూచనలను, సిఫార్సులను కలెక్టర్‌ ఖాతరు చేయటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎంపీలను కూడా ఆయన పట్టించుకోవడం లేదని టాక్. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదేశాలను, సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన కార్యాలయ అధికారులు కానీ కలెక్టర్‌కు సూచించి ఉంటారన్న ప్రచారం ఆ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. కలెక్టరే ఆయనకు ప్రయారిటీ ఇస్తుండడంతో మిగతా అధికారులూ అదే దారి పడుతున్నారని చెబుతున్నారు.
హోంమంత్రి సుచరితకు మంత్రి పదవి కొత్తయినప్పటికీ మోపిదేవికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అధికారులతో ఎలా వ్యవహరించాలి.. ఎలా పనిచేయించుకోవాలి వంటివన్నీ తెలిసిన వ్యక్తే. పైగా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంత్రి పదవి దక్కించుకున్న నేత. జగన్ ఆశీస్సులు పుష్కలంగా ఉంటే కానీ అలాంటి అవకాశం రాదు. అయినప్పటికీ ఆయన మాట కూడా గుంటూరు కలెక్టరేట్లో చెల్లుబాటు కావడం లేదని మంగళగిరి ఎమ్మెల్యే పేరు చెబితే అన్ని పనులూ క్షణాల్లో అయిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 

Read Also

మిగిల్చింది గోరంత.. మింగింది కొండంత
శ్రీల‌క్ష్మి కోసం సాయిరెడ్డి ప్ర‌ద‌క్షిణ‌లు... రీజ‌న్ ఇదే...!
బీజేపీకి మరో షాక్ రెడీగా ఉందా?