​రాజధాని మార్పునకు కారణం చెప్పిన లోకేష్​

February 24, 2020
CTYPE html>
రాజధానితో  రగులుతున్న ఏపీ...  ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఏం జరుగుతోంది. అసలు ఒక ముఖ్యమంత్రికి ఉండే హక్కులేంటి? ముఖ్యమంత్రి మారినపుడల్లా రాజధానులు మారితే పరిస్థితి ఏంటి? ఈ విషయం ముందే తెలిస్తే... మా భూములు ఎందుకు ఇస్తాం అంటూ రైతులు విస్మయంతో, భయంతో, ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. వారికి నిద్రలేదు. ఆకలి లేదు. భవిష్యత్తు లేదు. కనీసం ఆస్తి అయినా ఉందో లేదో తెలియదు. రాజధాని రైతుల పరిస్థితి మాత్రమే కాదు. ఏపీ ప్రజల మొత్తం పరిస్థితి ఇంతే. ఈ రచ్చకంతటికీ కారణమైన రాజధాని మార్పును ఎందుకు జగన్ ప్రతిపాదించారు అన్నది అందరికీ ఆశ్చర్యమే. దీనిపై తెలుగుదేశం నేత నారా లోకేష్ స్పందించారు.
రాజధాని మార్పు వెనుక జగన్ కు ఒక వ్యూహం ఉందని వెల్లడించారు. ఇది ఏదో అనుకోకుండా  తీసుకున్న నిర్ణయం కాదని.. తాను చేసిన తప్పుల నుంచి బయటపడటానికి జగన్ రచించిన వ్యూహం అని లోకేష్ ఆరోపించారు. ఒకటి వెనుక ఒకటి సమస్యలు చుట్టుముట్టడం, అంతర్జాతీయ కంపెనీలు మన వద్ద నుంచి వెనక్కు వెళ్లిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రజల దృష్టి మరలించడానికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని లోకేష్ అన్నారు. 
‘‘​పాలనతో ప్రజల్ని సంతృప్తి పరచలేని @ysjagan గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలని మూడు రాజధానులు, ముప్పై రాజధానులు అంటున్నారు. అభివృద్ధి అంటే అర్ధం తెలియని వ్యక్తి జగన్ గారు. విశాఖలో ఒక్క అదానీ డేటా సెంటర్ వలన రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభించేది. అసమర్థ పాలన, చెత్త నిర్ణయాలతో ఆ కంపెనీ రాష్ట్రానికి రాకుండా చేసారు. తిరుపతిలో ఒక్క రిలయన్స్ జియో ఫోన్ల తయారీ కంపెనీ రావడం ద్వారా రూ. 15 వేల కోట్ల పెట్టుబడి, 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. జగన్ అండ్ కో దౌర్జన్యాలు చూసి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో రాజధానులతో అభివృద్ధి అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు జగన్ గారు.‘‘ 
అంటూ లోకేష్ జగన్ కోట రహస్యాన్ని వెల్లడించారు. ఇది లోకేష్ వాదనే కాదు, చాలామంది వాదన ఇదే. గవర్నమెంటు కార్యకలాపాలను మూడు చోట్ల పెట్టినంత మాత్రాన అభివృద్ధి చెందుతుందా? ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించే పెట్టబడులు తెస్తే రాష్ట్రానికి ఉపయోగం అని పబ్లిక్ లో మెజారిటీ నమ్ముతున్నారు. వాస్తవం కూడా అదే. రాజధాని ప్రకటన అనంతరం తెలంగాణ ప్రజలు కూడా విస్మయం చెందారు. ఈరోజు తెలంగాణ ఆదాయంలో 70 శాతం మహానగరమైన హైదరాబాదు సంపాదిస్తోంది. మరి ఏపీలో ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి వస్తుందా ? అని ప్రశ్నిస్తున్నారు జనం.