వైఎస్ఆర్...వైెస్ జగన్...ఎంత తేడా !!

June 05, 2020
 

ఏపీ నుంచి నలుగురిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపేందుకు సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రాంకీ అధినేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి కోటాలో పరిమల్ నత్వానీలను వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా నిర్ణయించారు. ఇప్పటికే వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఆల్రెడీ నామినేట్ అయ్యారు. నత్వానీని మినహాయిస్తే రాజ్యసభకు నామినేట్ చేసిన వారి పేర్ల ఎంపికలో వైఎస్ జగన్ మార్క్ కనిపించింది. రాజ్యసభకు జగన్ నామినేట్ చేసిన వారిలో అత్యధికులు ఆయన జైల్ మేట్లు కావడం విశేషం. నత్వానీ మినహా జగన్ ఎంపిక చేసిన నలుగురిలో ఇద్దరు జగన్ జైలుమేట్లన్న సంగతి గమనించవచ్చు. విజయసాయిరెడ్డి, మోపిదేవిలు గతంలో జగన్ తో పాటు జైలులో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరిలో విజయసాయి ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు కాగా...మోపిదేవి ఎంపిక లాంఛనమే.

 

 

నాడు వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన అనంతరం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వైఎస్ చెక్కుచెదరకుండా నడిచారు. ఆ పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ముగించే వరకు వైఎస్ తో పాటు కొందరు నేతలు అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రం మొత్తం వైఎస్ వెన్నంటే ఉన్నారు. అలా పాదయాత్రలో తనతోపాటు నడిచిన వారికి వైఎస్ సముచిత గౌరవమిచ్చారు. సుధీర్ రెడ్డి వంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సుధీర్ రెడ్డితో పాటు తనతో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న పలువురు నేతలకు వైఎస్ఆర్ సముచిత గౌరవమిచ్చారు. నాడు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ బాటలోనే ఆయన తనయుడు జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. తండ్రి తరహాలోనే పాదయాత్ర చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. అయితే, తన తండ్రి వైఎస్ తో పోలిస్తే జగన్ ఓ విషయంలో పూర్తి భిన్నంగా ఉన్నారు. తనతో పాటు పాదయాత్ర చేసిన వారిని వైెఎస్ పదవులు కట్టబెడితే...అందుకు భిన్నంగా జగన్ మాత్రం తనతోపాటు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారికి పట్టం కట్టారు. వైఎస్ ఏమో తనతో పాటు జనం కోసం పాదయాత్ర చేసిన వారిక పదవులిచ్చి గౌరవిస్తే...  జగన్ ఏమో తనతో పాటు జైలు పాలు అయిన వారికి పదవులు ఇచ్చారు. తండ్రీ కొడుకులే గాని... ఇద్దరి విధాన నిర్ణయాల్లో ఎంత తేడా ఉందో అని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయి.