జగన్ అన్న ‘వాచి’ పోయింది

June 05, 2020

This is వాస్తవం

This going to be నిరంతర ప్రక్రియ

ఇలాంటి ఆణిముత్యాలు పరిచయం చేసిన మన ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ ’వాచి‘ కనపడటం లేదు. గత ప్రెస్ మీట్లో అది టైం తప్పుగా చూపించినందున దానిని రద్దు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఈరోజు లైవ్ అనబడే కార్యక్రమంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కరోనా సహజీవనం గురించి మరోసారి బల్లగుద్ధి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే వలస కూలీల కోసం, ఎన్నారైల కోసం ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆసక్తికరమైన కరోనా సమాచారం వెల్లడించినా కూడా ముఖ్యమంత్రి వాచీ కనపడకపోవడం వల్ల  ఆ అంశాలన్నీ కనుమరుగు అయ్యాయి. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి వాచీ గురించే మాట్లాడకుంటున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాచీ పోయిందా? వాచీని రద్దు చేశారా? వాచీని మరిచిపోయారా? ఇందులో ఏది జరిగి ఉంటుందని అందరూ సోషల్ మీడియాలో ఆరాతీస్తున్నారు. కొందరైతే ఏకంగా మన ముఖ్యమంత్రి వాచీ ఏమై ఉంటుందో చెప్పండి అంటూ సర్వేలు నిర్వహిస్తున్నారు. 

ఒక నెటిజన్ దీని గురించి స్పందిస్తూ కరోనా పోతే మళ్లీ వస్తుంది, వాచీ పోతే వస్తుందా? రాదా? అన్న దానిపై సామాజిక మాధ్యమాల నిపుణులతో చర్చా గోష్టి నిర్వహించారు. గత వారం అందరూ వాచీపై దిష్టిపెట్టడం వల్ల దానికి ఏమైనా జరిగిందా అని ఆస్తికవాదులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మరి ఈ చర్చ ఎక్కడ ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి.