వెనక్కు తగ్గిన జగన్ !

August 12, 2020

ఇటీవలే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నపుడు ఒక మాటన్నాడు.

జగన్ మోడీ చెబితే తప్ప ఎవరి మాటా వినరు. అది కూడా కేసుల భయంతోనే వింటున్నాడు అని అన్నారు.

అది నిజమే అని తాజాగా ప్రూవ్ అయ్యింది. 

నలుగురికి చెప్పే స్థానంలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆదర్శంగా నిలవాలి.

90 రోజులుగా దేశ ప్రధాని మాస్కు లేదా తువ్వాలు మూతికి అడ్డం పెట్టుకోకుండా కనిపించడం లేదు.

వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ మాస్క్ వాడుతున్నారు. 

కరోనాతో ముసలి వారే ఇబ్బందిపడతారు అనుకోవడం అపోహ అని ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. అయినా...  ఏపీ సీఎంకి మొదట్నుంచి కరోనాపై చిన్న చూపు చూస్తున్నారు.

కరోనా విషయంలో మాస్కు తప్పనిసరి అని అందరూ చెబుతూ  వాడుతున్నా ఏపీ ముఖ్యమంత్రి మాత్రం వాడేవారు కాదు.

పైగా చుట్టు జనాల్ని గుంపుగుంపులుగా పెట్టుకుని మీటింగులు పెట్టినపుడు కూడా మాస్క్ పెట్టుకునే వారు కాదు. 

మొన్న అసెంబ్లీలో అంతకు ముందు ప్రారంభోత్సవాల్లో, సమీక్ష సమావేశాల్లో, సినిమా వాళ్లు వచ్చి కలిసినపుడు ఎక్కడా మాస్కు పెట్టుకోలేదు.

ముఖ్యమంత్రికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా రాకపోవచ్చు.కానీ ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోరు మేమెందుకు పెట్టుకోవాలని ప్రశ్నించే జనాన్ని ఆపడానికి అయినా మాస్కు పెట్టుకోవాలి కదా.  

అయితే... ఇంతవరకు మాస్క్ పెట్టుకోని ముఖ్యమంత్రి సడెన్ గా ఈరోజు మాస్క్ తో కనిపించారు. అదేంటయ్యా అయ్యా... జేసీ చెప్పిందే నిజమైంది.

ప్రధాని నుంచి సర్పంచి వరకు అందరూ మాస్కు పెట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.

నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇది మంచిది కాదు... బల్గేరియా ప్రధానికే మాస్క్ లేదని ఫైన్ వేశారు అని నిన్న మోదీ క్లాస్ పీకారు. 

అంతే ఆ తర్వాత నుంచి జగన్ మొహానికి మాస్క్ వచ్చేసింది.

అంటే మోడీ చెబితేనే జగన్ వింటారు. లేకపోతే ఎవరినీ లెక్కచేయరని ప్రూవ్ అయ్యిందిగా.