జగన్ ఊహించనిది జరగబోతోందా? 

August 03, 2020
CTYPE html>
సోము వీర్రాజు... ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు టీడీపీలో పొత్తులో ఉంటూ కూడా జగన్ కోసం ఏకంగా చంద్రబాబుపై యుద్ధం ప్రకటించి టీడీపీ - బీజేపీ మధ్య చెడే వరకు ఊరుకోలేదు.
ఆయనకు జీవీఎల్, విష్ణువర్దన్ రెడ్డిలు తోడయ్యారు.
చివరకు ఏపీలో టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయిన సోము ఇపుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యారు.
రాగానే రెండో రోజే మూడు రాజధానులు కాదు, పదమూడు రాజధానులు వచ్చినా పర్లేదన్నాడు.
అంటే జై జగన్ అన్నంత పనిచేశాడు. మరి వెనుక ఇన్ పుట్స్ అలాంటివి మరి.
 
ఇది పక్కన పెడితే... బీజేపీ తీరే వేరు. ఈ దేశాన్ని బీజేపీ చేతుల్లోకి తీసుకురావడం కోసం ఎలాంటి విలువలు అయినా వదిలేయడానికి ఆ పార్టీకి ఏం అభ్యంతరం లేదు.
ఆ క్రమంలో ఎవరినైనా మోస్తుంది, ఇంకెవరినైనా తొక్కేస్తుంది. కానీ ఎవరినీ ప్రేమించదు.
ఇందులో ఎందరో సమిధలు అవుతుంటారు. ఇంకెందరో నలిగిపోతుంటారు.
అలా బీజేపీ రాజకీయం కింద నలిగిపోతున్న పిపీలకాలు అమరావతి రైతులు.
 
అన్నిటినీ ఒకే దేశం, ఒకే పాలసీ అని తరచూ నినాదం చేసే బీజేపీ రాజకీయాల్లో మాత్రం రకరకాల పాలసీలతో గేములు ఆడుతుంటుంది.
ఏ గేం ఆడినా బీజేపీ చేతిలోకి అధికారం తెచ్చుకోవడమే జరిగేది. చేపని చేపే మింగినట్టు... బీజేపీ తన కేంద్ర పార్టీ ప్రణాళిక సాధనలో భాగంగా తన లీడర్లను కూడా బలిచేస్తుంటుంది.
ఏపీ ఇపుడు ఆ పరిణామ క్రమంలోనే ఉంది. కేంద్రంలో ఏం జరుగుతుందో ఈ సోములకు, కన్నాలకు తెలియదు.
వీరు ద్వారపాలకులు వంటి వారు. లోపలకు వెళ్లి వస్తుండే బయట వారికి తెలిసినన్ని విషయాలు కూడా 24 గంటలు అక్కడే ఉండే వీరికి తెలియదు. అలా కాలం దొర్లిపోతుంటుంది.
 
చంద్రబాబు మీద ద్వేషం, జగన్ మీద ప్రేమ రెండూ నటనే.
గతంలో రివర్సు.. అది కూడా నటనే. ఇపుడు వీటికి మించి రాజధాని అంశం దొరికింది. వారిని కూడా వాడేసుకుంటోంది బీజేపీ... మూడు వర్గాలుగా పార్టీ లీడర్లను చీల్చేసింది.
కొందరు అమరావతి మద్దతుదారులు, కొందరు అమరావతి ఓకే, హైకోర్టు మాత్రం కర్నూలు కావాలనే వర్గం... ఇంకొందరు చంద్రబాబు వ్యతిరేక వర్గం.
ఎవరికి వారు తమ పార్టీ విధానం ఇదే అనుకుంటూ ఉంటారు. కానీ పైన పార్టీ టార్గెట్లు వేరుగా ఉంటాయి. ఈ విభజించు పాలించు పథకంలో ఏది విజయవంతం అయితే దానిని చివరకు ఫాలో అవుతారు.
అంటే ఆట ఆడేవాళ్లు వేర్వేరు, ఆడించేవాడు ఒక్కడే. ఎవడు గెలిచినా మెడల్ చేరేది అదే ఇంటికే అన్నమాట. 
 
తాము పరిష్కరించగలిగిన సమస్యలను కూడా వ్యూహాత్మకంగా ఆపి, ఆగి... తమ ప్రయోజనాలు లెక్కవేసుకునే క్రమంలో ప్రస్తుతం బలవుతున్న బడుగు జీవులు అమరావతి రైతులు. బీజేపీ ఆడుతున్న ఈ మూడు ముక్కలాటలో చంద్రబాబు బలవుతాడని జగన్, జగన్ బలవుతాడని చంద్రబాబు... వీరిద్దరు అవుట్... అంతా మేమే అని లోకల్ బీజేపీ అనుకుంటూ ఉంటుంది.
కానీ ఇవేవీ పారామీటర్లు కానే కాదు. కోరుకున్నది ఏపీలో జరిగేదాకా వారికి అవకాశం ఉన్నంత వరకు కేంద్ర బీజేపీ తన గేమును ఆడుతూనే ఉంటుంది. 
ఇది ఎపుడు ముగుస్తుందో ఇక్కడెవరికీ తెలిసే అవకాశమే లేదు. అన్నీ వ్యక్తిగత అభిప్రాయాలే. అన్ని అంచనాలు తాత్కాలిక నిజాలే.