జగన్ కు 15 నెలలు ఓపిక లేదా? 

May 22, 2020

ఎందుకు పదిహేను నెలలు? 15 నెలలు జరిగితే ఏమవుతుంది అనుకుంటున్నారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏపీ శాసన మండలిలో మెజారిటీ ఉన్న పార్టీ. దీనివల్ల వైఎస్ జగన్ తీసుకుంటున్న అరాచక నిర్ణయాలను అక్కడ టీడీపీ అడ్డుకుంటోంది. ఏర్పాట్లు చేయకుండా, సరైన శిక్షణ ఇవ్వకుండా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెట్టి పిల్లలు భవిష్యత్తు నాశనం చేయొద్దని తెలుగుదేశం వాదన దానిని జగన్ వినడం లేదు. 

అదేవిధంగా రాజధాని విషయంలో యువత భవిష్యత్తును పట్టించుకోకుండా, ఇప్పటికి ఖర్చు పెట్టిన 10 వేల కోట్లను పట్టించుకోకుండా మారుద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం. అందుకే దీనిని కూడా టీడీపీ అడ్డుకుంటోంది. ఇది జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. 

ఏపీ మండలిని రద్దు చేస్తే నాకు ఏ ఇబ్బందులు ఉండవు, అడ్డు చెప్పే వారు ఉండరు అని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అమరావతి తరలింపును నిరసిస్తూ లక్షల మంది ర్యాలీలు చేస్తుంటే... అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ అమరావతి మార్పును స్వాగతిస్తున్నారు అంటూ జగన్ అబద్ధాలు చెబుతున్నారు. అందుకే తనకు మెజారిటీ ఉన్న అసెంబ్లీని ఉంచుకుని తనకు మెజారిటీ లేని మండలిని రద్దు చేయాలనుకుంటున్నారు జగన్. 

అయితే... 15 నెలలు ఆగితే ఈ విషయంలో జగన్ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే అసెంబ్లీ లాగ శాసన మండలికి ఒకేసారి ఎన్నికలు జరగవు. దశల వారిగా ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో 2021  జూన్ నాటికి టీడీపీ మెజారిటీ తగ్గి వైసీపీ కి మండలిలో మెజారిటీ వస్తుంది. అంటే 15 నెలల తర్వాత మండలిలలో వైసీపీది పై చేయి అవుతుంది. మరి అంతవరకు ఆగితే తనదే రాజ్యం కాబట్టి జగన్ ఆగుతారా? లేదా? అన్నది ఇపుడు పెద్ద సందేహం. అయినా... అన్నీ రెడీమేడ్ గా అనుకున్నదే తడవుగా అవ్వాలనుకునే జగన్ ఏం నిర్ణయిస్తారో చూడాలి.