జ‌గ‌న్ జైలుకే... సీఎం రేసులో ఈ న‌లుగురు?

May 31, 2020

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యీలను వీధిరౌడీలని కామెంట్ చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్మోహన్‌రెడ్డిపై ప్ర‌తిప‌క్షం ఘాటుగా స్పందించింది. `ఐపీసీ సెక్షన్‌ 420, 409, 468, 440, 477ఏ, 420బి, 353, 427, 290, 105, 498, 499, 186, 188, ఇన్ని సెక్షన్లు ఉన్న మీరా మాట్లాడేది. మిమ్మలి ఏమన్ని పిలవాలి?`` అని తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనురాధ సూటిగా ప్ర‌శ్నించారు.
ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌పై పంచుమ‌ర్తి అనురాధ సంచ‌ల‌న వ్యాఖ్యానించారు. ``సీఎం జగన్మోహన్‌రెడ్డి ఖచ్చితంగా జైలు వెళ్తాతారని నిపుణులు చెబుతున్నారు. త‌మిళ‌నాడు దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత నెచ్చెలి శశికళ కేవలం రూ.66 కోట్ల అవినీతి సొమ్ము విష‌యంలో జైలుకు వెళ్లిన పరిస్థితి ఉంది. అదే ముఖ్య‌మంత్రి జగన్మోహన్‌రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. ఇప్పటికే రూ.43వేల కోట్లను సీబీఐ జప్తు చేసింది. కాబట్టి ఈ అంచ‌నా వేస్తున్నారు. మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రోజారెడ్డికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. అందుకే, ముఖ్యమంత్రి కావాలనే రేసులో ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషిస్తున్నారు. బొత్స సత్యనారాయణ గతంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరిక ఉంది.`` అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి క‌న్న‌బాబుపై సైతం అనురాధ ఘాటుగా స్పందించారు. ``కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు  వైసీపీ పార్టీ చంచల్‌గూడ పార్టీ అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి మహానుభావుడు అని మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్‌  పైరవీలు చేసుకోవడానికి మాత్రమే అని కన్నబాబు మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌బ‌బా?`` అని తెలుగుదేశం పార్టీ నేత నిల‌దీశారు.