జగన్ ఢిల్లీకి పరుగో పరుగు... కారణమెవరు?

August 06, 2020

అప్రతిహత విజేత జగన్ లో భయం ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఎందుకు? ఏమైంది? మొన్నటి వరకు ఉన్న ధీమా ఎక్కడికిపోయింది? వంటి ప్రశ్నలు అందరి మొహాల్లోనే కనిపిస్తున్నాయి. మాటల దాకా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీలో తాను ఊహించింది ఏమో 30 ఏళ్ల వరుస పాలన. కాని 30 నెలలు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కారణం ప్రతిపక్షం కాదు... కాసుల్లేని ఖజానాతో రాష్ట్రాన్ని నడిపే అనుభవం లేక ఒకవైపు, ప్రతిపక్షాలను ముఖ్యంగా పవన్ బీజేపీ మధ్య సంబంధాలు జగన్ కి నిద్ర పట్టనివ్వడం లేదు. 

కొద్దిరోజులుగా పలువురు నేతల నుంచి బీజేపీ పవన్ ను చేరదీస్తోందన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా పవనే స్వయంగా అమిత్ షా నాయకత్వం కావాలన్నారంటే... ఇక ఇప్పటికే శరణుజొచ్చిన వైసీపీకి భయం పట్టుకుంది. పవన్ బీజేపీకి దగ్గరయితే మా పరిస్థితి ఏం గాను అన్నట్లుంది వైసీపీ తీరు. అందుకే రేపు మధ్యాహ్నం మోడీతో మీటింగ్ పెట్టుకున్నారు జగన్. ఈరోజు బాబు ప్రారంభించిన కియాను మళ్లీ ప్రారంభించిన జగన్... తాజాగా బాబు శంకుస్థాపన చేసిన కడప ఉక్కుకు కూడా త్వరలో మళ్లీ తన ఖాతాలో శంకుస్థాపన చేయనున్నారట. ఈ సెకండ్ హ్యాండ్ శంకుస్థాపనకు మోడీని పిలవడానికి వెళ్లారని బయట ప్రచారం జరుగుతోంది.

అయితే పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం... మహాప్రభో అవసరమైతే నేను పార్టీకి ఎన్డీయేలో చేరి మద్దతు ఇస్తాను. దయచేసి ఏపీలో నన్ను కాకుండా వేరే వారిని చేరదీయకండి... నా అంతటి విధేయుడు మీకు దొరకడు అని మోడీకి చెబుతున్నారట వైసీపీ అధినేత. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ పెద్దలతో మొరపెట్టుకోవడానికి ఢిల్లీ పయనం అయ్యారని వినికిడి. సరే తన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. అందులో తప్పేంలేదు. అయితే... ఇతరుల పౌరుషాన్ని తప్పుపట్టినపుడే ఇలాంటి ప్రశ్నలు వేయాల్సి వస్తుంది మరి. !