జగన్ ను సైతం హిమాన్షు డామినేట్ చేశారా?

July 16, 2020

ఇంట్లో ఎంతమంది హీరోలు ఉన్నా.. బయటవారి మీద ఉండే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది సామాన్యుల ఇళ్లల్లోనే కాదు.. ప్రముఖుల కుటుంబాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కేసీఆర్.. కేటీఆర్ అంటే జగన్ ఫ్యామిలీలో క్రేజ్ ఉంటుంది. అదే సమయంలో జగన్ అంటే కేసీఆర్.. కేటీఆర్ ఫ్యామిలీలో క్రేజ్ ఉంటుంది. అంతదాకా ఎందుకు.. రాజకీయాలకు సంబంధం లేని సినిమా ఇండస్ట్రీలోనూ ఇలాంటి చిత్రమైన క్రేజ్ లు అప్పుడప్పడు బయటకు వస్తుంటాయి.
ఇటీవల అల వైకుంటపురములో మ్యూజికల్ నైట్ ఫంక్షన్ లో చిత్ర దర్శకుడు తివ్రికమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్యకు నవదీప్ అంటే చాలా ఇష్టమని.. అతడ్ని కలిసేందుకు ప్యారిస్ వచ్చిందని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. బిగ్ బాస్ షో నుంచి నవదీప్ అంటే తన భార్యకు అభిమానమని పేర్కొనటం చూస్తే.. ఇంట్లో త్రివిక్రమ్ లాంటి మేజికల్ సెలబ్రిటీ ఉన్నప్పటికీ.. నవదీప్ మీద అభిమానాన్ని పెంచుకోవటం చూసినప్పుడు ఇంట్లో వారిని మాత్రమే అభిమానించాలన్న పరిమితులు ఏమీ ఉండవు.
తాజాగా కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతిభవన్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు.. ఆయన్ను కలుసుకునేందుకు.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు.. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రదర్శించిన ఆత్రుత చూసినప్పుడు జగన్ మీద క్రేజ్ ఎంతటి క్రేజ్ ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది. అయితే.. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన హిమాన్షును జగన్ అప్యాయంగా పలుకరించటం ఒక ఎత్తు ఉంటే.. ఇటీవల కాలంలో మాంచి హైట్ వచ్చేసిన హిమాన్షు ముందు జగన్ చిన్నగా కనిపించటం గమనార్హం.
మంచి పొడగరి అయిన జగన్ .. హిమాన్షు ముందు తేలిపోయినట్లుగా కనిపించటానికి కారణం.. ఆ కుర్రాడి హైట్ తో పాటు.. అందుకు తగ్గ వెయిట్ కూడా ఉండటం.. ఆ పక్కనే సన్నగా ఉన్న జగన్ అట్టే ఆనలేదు. ఒకవిధంగా చెప్పాలంటే.. తన పర్సనాలిటీతో జగన్ ను హిమాన్షు డామినేట్ చేశారని చెప్పక తప్పదు.

Read Also

క్లీవేజ్ నిధి... మెరిసింది మళ్లీ !!
ఆదాయం పెంచుకునే మార్గమెక్కడ సీఎం గారూ??
సెక్సీ డ్రెస్ లో సమంత !!