జగన్ సర్కారు ఫెయిల్ - గవర్నమెంటు డాక్టర్ల సంఘం అటాక్... బహిరంగ లేఖ,

August 05, 2020
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలోని అస్తవ్యస్థ పరిస్థితిపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
సంక్షోభ సమయంలో కరోనా నుంచి ప్రజలను గట్టెక్కించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆయన విచారం వ్యక్తంచేశారు.
వైద్యులకు దక్కుతున్న అధ్వాన్న సదుపాయాలు, అక్కడి పరిస్థితిపై కొన్ని ప్రధాన సంఘటలను ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఈ ప్రభుత్వానికి బాధ్యతనేదే లేదు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు అంటూ విమర్శించారు.

చంద్రబాబు వేసిన వరుస ట్వీట్లు ఇవే

తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలందిస్తూ కరోనా బారినపడి "నా బిడ్డల కోసం బతకాలి. మెరుగైన చికిత్స అందించి బతికించండి" అని వేడుకున్న వైద్యుడి ప్రాణాలు కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయం. 

"మర్యాద లేనిచోట పనిచేయలేమంటూ" వైద్యుల సంఘం సీఎస్ కు లేఖరాయడం రాష్ట్రంలో దుస్థితికి నిదర్శనం. సమీక్షా సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రకాశం డిఎంహెచ్ వోను నిల్చోబెట్టారు. 

అనంతపురం డిఎంహెచ్ వోను వ్యక్తిగతంగా దూషించారు.శ్రీకాకుళం, నెల్లూరు డిఎంహెచ్ వోలను సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేస్తుండటంతో పని చేయలేక పోతున్నట్లుగా వైద్యుల సంఘం లేఖలో డాక్టర్లు ఆవేదన వెలిబుచ్చారు. 

విజయవాడ, తెనాలి, నెల్లూరులలో డాక్టర్లు మరణించినా ఇంతవరకు నష్ట పరిహారం ప్రకటించలేదని వాపోయారు. మాస్క్ ల కోసం విశాఖలో డాక్టర్ల ధర్నా, రక్షణ పరికరాల కోసం ఒంగోలులో ల్యాబ్ టెక్నీషియన్ల ధర్నా... 

ఏమిటివన్నీ? మాస్క్ అడిగాడని దళిత డాక్టర్ సుధాకర్ పై కక్షగట్టి, నడిరోడ్డుపై లాఠీలతో కొట్టించారు.

చిత్తూరు జిల్లాలో డా. అనితారాణిపై అసభ్య వీడియోలు తీశారు.

కరోనా విపత్తులో తమ ప్రాణాలు అడ్డుపెట్టి, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులపట్ల ఏమిటీ అమానుషాలు..? ఏ రాష్ట్రంలోనైనా వైద్యుల పట్ల ఈ నిర్లక్ష్యం ఉందా..?

కరోనా నుంచి రికవరీలో ఏపి అట్టడుగున ఉండటం చూస్తే బాధేస్తోంది. మరోవైపు ఫ్రంట్ లైన్ వారియర్ల పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆవేదన కలిగిస్తోంది.

ఇవి చాలవన్నట్టు కరోనా కిట్ల స్కామ్, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలతో వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి కరోనాతో పోటీపడుతోంది.
కరోనా విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి.

వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక భద్రతా పరికరాలు అందించాలి.