జగన్ గారి మడమ తిప్పడం ఇలా వుంటుంది:!

July 15, 2020

1.వైజాగ్ ని చంద్రబాబు రాజధానిగా చేసి ఉంటే:
జగన్ ఇలా అని ఉండేవాడు: అధ్యక్షా! ఇంత తలకుమాసిన పనిని కనీసం రెండో తరగతి విద్యార్థి కూడా చేయడు. రాయలసీమ ప్రాంత ప్రజలు రెండు రోజుల పాటు ప్రయాణం చేసి సచివాలయం కి వెళ్లి ఏ విధంగా పనులు చేసుకుంటారు అధ్యక్షా ?. ఏ మాత్రం బుర్ర ఉన్నా అందరికీ సమాన దూరంలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. ఇప్పటికే వైజాగ్లో తాగునీటి సౌకర్యం లేదు. కాలుష్యం ఎక్కువ. ఈ ముఖ్యమంత్రి తెగల జీవనాన్ని సర్వ నాశనం చేసేందుకు ఈ ఎత్తుగడ వేశాడు అధ్యక్షా!. .. కనీస మౌలిక సౌకర్యాలు లేని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయటం సిగ్గుచేటు ‌.విజయవాడ అన్ని రకాలుగా అనువైనది కాబట్టే బ్రిటిష్ వారు కూడా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.


2. కర్నూల్ ని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేసి ఉంటే-

అధ్యక్షా, కేవలం 200 కిలోమీటర్ల దూరంలో Hyderabad ఉంటే ఈ రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇంతకన్నా పనికిమాలిన నిర్ణయం ఏదైనా ఉందా? ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానికి ఏవిధంగా రాగలరు? కర్నూలు కనెక్టివిటీ ఏమిటి? కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా?


3.చంద్రబాబు విజయవాడలో ఒక పది బిల్డింగ్లు లో సచివాలయం ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేసి ఉంటే:
జగన్ గారు: అధ్యక్షా! ఒక గొప్ప రాజధాని నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. కానీ పనికిమాలిన ముఖ్యమంత్రి పది బిల్డింగులు తీసుకుని ఇదే రాజధాని అంటున్నాడు. కాలుష్యానికి దూరంగా విశాలమైన రోడ్లతో తరువాత ఐదు తరాల కూడా పనికి వచ్చే రాజధాని నిర్మించే ఆలోచన కూడా లేని పెద్దమనిషి ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించ గలడు? షంద్రబాబు గారు, విశాలమైన రాజధాని నిర్మించటంలో చూపిస్తున్న నిర్లక్ష్యానికి భవిష్యత్ తరాలు క్షమించవు