మోడీ జగన్ భేటీ ఎపుడు?

July 14, 2020

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్... పదవిని చేపట్టడానికి ముందే ప్రధాని నరేంద్రమోడీని కృతజ్జతా పూర్వకంగా కలువనున్నారు. ఏపీలో పార్టీని త్యాగం ప్రతి దశలో తన పార్టీకి అండగా నిలిచింది బీజేపీ. వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరించింది. ఈ నేపథ్యంలో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న జగన్ ఈనెల 26వ తేదీ మోడీని కలవనున్నారు.
మే 23న గెలిచిన వెంటనే మోడీ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, తనకు అన్నివిధాల అండగా ఉన్న మోడీకి ముందునుంచి జగన్ మద్దతుగా ఉన్నారు. పోలింగ్ కు ముందు ఓ ఇంటర్వ్యలో మోడీ కంటే విజయవంతమైన వ్యక్తి లేడు అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక గాలి వీస్తోందని అపుడు అందరూ భావించారు. చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ లోపాయకారిగా బీజేపీతో కలిసి ఉన్నా కూడా బహిరంగ విమర్శలు చేశారు. అలాంటి సమయంలో జగన్ మోడీని జాతీయ మీడియాలో ప్రశంసించి కలకలం రేపారు. కానీ... ఏపీకి మోడీ అన్యాయం చేశాడని అందరూ అంటున్నా కూడా జగన్ ధైర్యంగా మోడిని కొనియాడటం రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచింది. ఏదైతేనేం జగన్ తన లక్ష్యాన్ని చేరుకున్నారు.
తనకు నచ్చిన అత్యుత్తమ ప్రధాన మంత్రితో బేటీ కానున్నారు. అంతేకాదు, తన ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానించనున్నారు. అయితే, ఇద్దరు ఒకేరోజు ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టుకోవడంతో ఒకరిదానికి ఒకరు వెళ్లకపోవచ్చు.