ఎవరీ జకీర్ నాయక్ ? 2.75 కోట్ల జరిమానా ఎందుకు వేశారు?

August 09, 2020

వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ యొక్క పీస్ టీవీ నెట్‌వర్క్‌కు బ్రిటన్ ప్రభుత్వ సంస్థ ఆఫ్‌కామ్ యుకె లో "ద్వేషపూరిత ప్రసంగం" మరియు "అత్యంత అభ్యంతరకరమైన" సమాచారాన్ని ప్రసారం చేసినందుకు 300,000 పౌండ్లు (2.75 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. కమ్యూనికేషన్ సేవల్లో లండన్ రెగ్యులేటర్ తన ప్రసార నియమాలను ఉల్లంఘించినందుకు పీస్ టీవీ ఉర్దూ (200,000 పౌండ్లు), పీస్ టీవీ (100,000 పౌండ్లు) కు జరిమానా విధించింది.

"పీస్ టివి ఉర్దూ, పీస్ టివిలలో ప్రసారం చేయబడిన కార్యక్రమాలలో ద్వేషపూరిత ప్రసంగం, అత్యంత అభ్యంతకరం అయిన సమాచారం ఉన్నాయని మా పరిశోధనలలో కనుగొన్నాం, ఇది నేరాన్ని ప్రేరేపించే అవకాశం ఉంది" అని ఆఫ్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కంటెంట్ నియమాలకు, నిబంధనలకు విరుద్ధం, దీనికి శిక్షగా 3 లక్షల పౌండ్లు జరిమానా విధిస్తున్నట్లు బ్రిటన్ సర్కారు పేర్కొంది.

పీస్ టీవీని లార్డ్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ సొంతం చేసుకుంది, క్లబ్ టీవీ అనే సంస్థ పీస్ టీవీ ఉర్దూ లైసెన్స్‌ను కలిగి ఉంది. ఈ రెండు సంస్థలకు యూనివర్సల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మాతృ సంస్థ. ఘోరం ఏంటంటే.... ఇది ముంబైకి చెందిన సంస్థ. 54 ఏళ్ల ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ దీని యజమాని. చివరకు ప్రపంచ వ్యాప్తంగా ద్వేషాన్ని నింపడానికి ఈ దుర్మార్గుడు మన భరతభూమిని వేదికగా చేసుకున్నాడు. ఇలాంటి వారిని ఏరేయకపోతే ... మన దేశానికి చెడ్డ పేరు రాదా? ఇలాంటి సంస్థలు ఏం చేస్తున్నాయనేదానిపై భారత్ నిఘా లేకపోతే కచ్చితంగా మన దేశంపై ఇలాంటివి మచ్చగా మిగిలిపోతాయి.

ఇతనికి ప్రపంచంలోని అనేక దేశాలలో మీడియా సంస్థలున్నాయి. ఆశ్చర్యకరం ఏంటంటే... ఇవన్నీ లాభాపేక్ష లేని మీడియా సంస్థలు. మరి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీన్ని బట్టి వీరు ఏ అరాచకాలకు ప్లాన్ చేస్తున్నారో అర్థం కావడం లేదూ!

ఈ వివాదాస్పద మత బోధకుడు భారతదేశంలో మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన కేసులున్నాయి. అతను 2016 లో భారతదేశం విడిచిపెట్టి పరరాయ్యాడు. మన మీద కోపంతో మలేషియాలో అతనికి  శాశ్వత నివాసం కల్పించింది ఆ ప్రభుత్వం. 2010 నుంచి ఇతనికి యుకెలో ప్రవేశమే లేదు. భారతదేశం ఇతడిని ఇండియాకు రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మలేషియా సరైన స్పందన ఇవ్వడం లేదు.