జనసేన అభ్యర్థుల జాబితా ఇదే

May 21, 2019

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచేశారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వ్యవహారాన్ని ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో జనసేనాని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నామినేషన్ల పర్వం మరో వారంలో ప్రారంభంకానుండటంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ఎంపిక చేసి ప్రచార బరిలోకి దిగేందుకు జనసేన కసరత్తు చేస్తోంది. వాస్తవానికి జనసేన అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం సరికొత్త పంధాను ఎంచుకుంది. టికెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ అందరికి స్వేచ్ఛను ఇచ్చారు పవన్ కళ్యాణ్. పార్టీలో సీనియర్లుగా ఉన్న మాదాసు గంగాధరం, శ్రీ అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్ వంటి నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ విజయవాడ కార్యాలయంలో దరఖాస్తుల్ని స్వీకరించింది. మూడు రోజుల క్రితం అమలాపురం, రాజమండ్రి ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం నుంచి డీఎంఆర్‌ శేఖర్‌ పేరు ప్రకటించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో పవన్‌ సమక్షంలో శేఖర్‌ పార్టీలో చేరారు. చేరిన వెంటనే ఆయన అభ్యర్థిత్వాన్ని పవన్‌ ఖరారు చేశారు. దీని తర్వాత కీలక ప్రకటన చేశారు. 32 అసెంబ్లీ స్థానాలకు, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేశామని, రెండు రోజుల్లో ఈ జాబితా విడుదల చేస్తామని పవన్ ప్రకటించారు. అయితే, ఆయన బుధవారం అర్ధరాత్రి 32 మంది ఎమ్మెల్యే, నలుగురు ఎంపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించారు.

ఎంపీ అభ్యర్థులు
అమలాపురం: డీఎంఆర్‌ శేఖర్‌
రాజమహేంద్రవరం: ఆకుల సత్యనారాయణ
విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు
అనకాపల్లి: చింతల పార్థసారథి

ఎమ్మెల్యే అభ్యర్థులు
1. శ్రీకాకుళం: కోరాడ సర్వేశ్వరరావు
2. రాజాం: ముచ్చా శ్రీనివాసరావు
3. పలాస: కోత పూర్ణచంద్రరావు
4. యలమంచిలి: సుందరపు విజయ్‌ కుమార్‌
5. పాయకరావుపేట: నక్కా రాజబాబు
6. పాడేరు: పసుపులేటి బాలరాజు
7. ఎచ్చెర్ల: బాడాన వెంకట జనార్దన్‌ (జనా)
8. నెల్లిమర్ల: లోకం నాగ మాధవి
9. కాకినాడ సిటీ: ముత్తా శశిధర్‌
10. తుని: రాజా అశోక్‌బాబు
11. రాజమహేంద్రవరం గ్రామీణ: కందుల దుర్గేష్‌
12. రాజోలు: రాపాక వరప్రసాద్‌
13. పి.గన్నవరం: పాముల రాజేశ్వరి
14. అనపర్తి: రేలంగి నాగేశ్వరరావు
15. ముమ్మడివరం: పితాని బాలకృష్ణ
16. మండపేట: వేగుళ్ల లీలాకృష్ణ
17. ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు
18. తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్‌
19. ఉంగుటూరు: నౌడు వెంకటరమణ
20. మచిలీపట్నం: బండి రామకృష్ణ
21. తెనాలి: నాదెండ్ల మనోహర్‌
22. గుంటూరు పశ్చిమ: తోట చంద్రశేఖర్‌
23. ప్రత్తిపాడు: రావెల కిషోర్‌బాబు
24. వేమూరు: ఏ.భరత్‌ భూషణ్‌
25. నరసరావుపేట: సయ్యద్‌ జిలానీ
26. కావలి: పసుపులేటి సుధాకర్‌
27. నెల్లూరు గ్రామీణ: చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
28. ఆదోని: మల్లికార్జునరావు (మల్లప్ప)
29. ధర్మవరం: మధుసూధన్‌రెడ్డి
30. రాజంపేట: ప్రత్తిపాటి కుసుమ కుమారి
31. రైల్వేకోడూరు: బోనాసి వెంకట సుబ్బయ్య
32. పుంగనూరు: బోడె రామచంద్ర యాదవ్‌