ఆర్జీవీకి శ్రద్ధాంజలి ... !!

August 07, 2020

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వ్యాంప్ క్యారెక్టర్ గా చూపించిన ఆర్జీవీపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. వారిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కి ఆర్జీవీ నేరుగా దొరికితే చంపేసి జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అది నెరవేరదు కాబట్టి... వారు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు.

ఆర్జీవీ డిసెంబరు 12 న (అ.రా.కడప బిడ్డలు విడుదల తేదీన) మరణించినట్టు ఒక పోస్టరు తయారుచేశారు. శ్రద్ధాంజలి... ‘‘జోహార్ ద బాస్టర్డ్’’... నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని, నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని, భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పోస్టరు డిజైన్ చేశారు. దానిని ఫ్లెక్సీ చేయించి కట్టారు. గోదావరి జిల్లాలోని కోడూరుపాడు గ్రామంలోని జనసేన కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు కట్టారు. దీనిని రాంగోపాల్ వర్మ స్వయంగా తన ట్విట్టరులో షేర్ చేశారు.

ఈ సందర్బంగా వర్మ చేసిన కామెంట్ ఏంటో తెలుసా... ‘‘మీ లీడర్ ని దయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ఇపుడు ఇది వైరల్ అవుతోంది.