జనసేన రీషఫుల్ - నాదెండ్ల కీలకం, జేడీ అదృశ్యం

May 26, 2020

ఓటమి శాశ్వతం కాదు - ఇదే జనసేన నమ్మకం. 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసినా ఓట్ల చీలిక కొత్త రాష్ట్రానికి ప్రమాదం అని భావించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. తర్వాత 2019 ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే కమిటీలు, ఉప కమిటీలు, నెట్ వర్క్ లేక పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీ అధినేతను ఏమీ పెద్దగా ఇబ్బంది పెట్టినట్టు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో తొలుత పార్టీలో కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ దిశగా వేగంగా ముందుకు పోతున్నారు. ఎన్నికల్లో సీట్లు వచ్చిన పార్టీ కంటే... ఏకైక సీటొచ్చిన పార్టీ అయిన జనసేనలోనే ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. 2024 మనదే అనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించింది. జనసేన తాజాగా పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీలను నియమించింది. నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరోను ఏర్పాటుచేసింది. రాజకీయ వ్యవహారాల కమిటీలో 12 మంది ఉన్నారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరాన్ని నియమించారు.


జనసేన పోలిట్ బ్యూరో

1. నాదెండ్ల మనోహర్
2. పి.రామ్మోహన్ రావు
3. రాజు రవితేజ్
4. అర్హంఖాన్

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ

ఛైర్మన్: నాదెండ్ల మనోహర్

సభ్యులు :
1.తోట చంద్రశేఖర్
2.రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు)
3. కొణిదెల నాగబాబు
4. కందుల దుర్గేష్
5. కోన తాతారావు
6. ముత్తా శశిధర్
7. పాలవలస యశస్విని
8. డా.పసుపులేటి హరిప్రసాద్
9. మనుక్రాంత్ రెడ్డి
10. ఎ.భరత్ భూషణ్
11. బి.నాయకర్