జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ లో ప్ర‌త్యేక‌త అదే!

July 21, 2019
CTYPE html>
అంద‌రి కంటే ముందుగా ఏపీలో జ‌న‌సేన అభ్య‌ర్థుల జాబితా విడుద‌లైంది. గ‌డిచిన కొద్ది రోజులుగా క‌స‌ర‌త్తు మీద క‌స‌ర‌త్తులు జ‌రిపిన పిమ్మ‌ట‌.. ప‌వ‌న్ త‌న పార్టీ పెట్టిన ఐదేళ్ల‌కు తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలోకి నిల‌వ‌టం ఒక ఎత్తు అయితే.. స‌రిగ్గా పార్టీ వ్య‌వ‌స్థాపక దినోత్స‌వం రోజున తొలి జాబితాను విడుద‌ల చేయ‌టం విశేషంగా చెప్పాలి. 
జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం 2014 ఏప్రిల్ 14 కాగా.. ఎన్నిక‌ల బ‌రిలో ఆ పార్టీ తొలిసారి అభ్య‌ర్థుల్ని దించుతున్న‌ది ఇప్పుడే. త‌న తొలి అభ్య‌ర్థుల జాబితాను బుధ‌వారం అర్థ‌రాత్రి (1.30 గంట‌ల‌కు) వేళ విడుద‌ల చేశారు. పేరుకు బుధ‌వారం అర్థ‌రాత్రి అయిన‌ప్ప‌టికి క్యాలెండ‌ర్ ప్ర‌కారం ఏప్రిల్ 14న అంటే పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం రోజునే విడుద‌ల చేసిన‌ట్లుగా చెప్పాలి.
జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ విడుద‌ల‌లో ఇదో ప్ర‌త్యేక‌తగా చెప్పాలి. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ప‌వ‌న్ కు భ‌క్తి ఎక్కువ‌నే చెబుతారు. ఆయ‌న‌కు న‌మ్మ‌కాలు ఉంటాయ‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. తారా బ‌లం ప్ర‌కారం ఆయ‌న ల‌క్కీ నెంబ‌రు ఒక‌టి. ఒక ఆయ‌న‌కు అదృష్ట రోజులుగా బుధ‌వారం.. శ‌నివారంగా చెప్పాలి. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఎంపీ అభ్య‌ర్థులు న‌లుగురు.. ఎమ్మెల్యే అభ్య‌ర్థులు 32 మంది. మొత్తంగా 36 మంది అవుతారు. రెండింటిని కూడితే 9 అవుతుంది. దీని ప్ర‌కారం జాబితా విడుద‌ల‌లో న‌మ్మ‌కాల‌కు ప‌వ‌న్ ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని చెప్పాలి.
కాకుంటే.. ఏపీలో జ‌న‌సేన పార్టీ బ‌ల‌మంతా గోదావ‌రి జిల్లాలు.. ఉత్త‌రాంధ్ర‌గా చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే జాబితాలో పేర్కొన్న తొలి ఎంపీ స్థానం అమ‌లాపురం అంటే గోదావ‌రిజిల్లా కాగా. పార్టీకి మంచి ప‌ట్టు ఉంద‌ని చెప్పే ఉత్త‌రాంద్ర‌కు చెందిన య‌ల‌మంచ‌లి స్థానాన్ని తొలి అసెంబ్లీ అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించ‌టం విశేషం. అసెంబ్లీ జాబితాలో పేర్కొన్న తొలి ఆరు సీట్లు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన‌వి కావ‌టం మ‌రో ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. ఇక‌.. పార్టీ ప్ర‌క‌టించిన నాలుగు ఎంపీ స్థానాలు గోదావ‌రి.. ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చెందిన‌వి కావ‌టం గ‌మ‌నార్హం.
పార్టీ విడుద‌ల చేసిన తొలి అభ్య‌ర్థుల జాబితాను చూస్తే.. 
 
 
లోక్ స‌భ అభ్య‌ర్థులు ఫ‌స్ట్ లిస్ట్..
 
1. అమ‌లాపురం: డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
 
2. రాజ‌మండ్రి : ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
 
3. విశాఖ‌ప‌ట్నం: గేదెల శ్రీనుబాబు
 
4. అన‌కాప‌ల్లి:  చింత‌ల పార్ధ‌సార‌ధి
 
------------------ 
అసెంబ్లీ అభ్య‌ర్థులు ఫ‌స్ట్ లిస్ట్‌.. 
 
1. య‌ల‌మంచిలి : సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,
 
2. పాయ‌క‌రావుపేట:  న‌క్కా రాజ‌బాబు
 
3. పాడేరు : ప‌సుపులేటి బాల‌రాజు
 
4. రాజాం : ముచ్చా శ్రీనివాస‌రావు
 
5.శ్రీకాకుళం : కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
 
6. ప‌లాస‌ : కోత పూర్ణ‌చంద్ర‌రావు
 
7. ఎచ్చెర్ల‌ : బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
 
8. నెల్లిమ‌ర్ల‌ : లోకం నాగ‌మాధ‌వి
 
9.  తుని : రాజా అశోక్‌బాబు
 
10. రాజ‌మండ్రి సిటీ : కందుల దుర్గేష్‌
 
11. రాజోలు : రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
 
12. పి.గ‌న్న‌వ‌రం : పాముల రాజేశ్వ‌రి
 
13. కాకినాడ సిటీ: ముత్తా శ‌శిధ‌ర్‌
 
14. అన‌ప‌ర్తి : రేలంగి నాగేశ్వ‌ర‌రావు
 
15. ముమ్మిడివ‌రం : పితాని బాల‌కృష్ణ‌
 
16. మండ‌పేట‌ :  వేగుళ్ల లీలాకృష్ణ‌
 
17. తాడేప‌ల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్‌
 
18. ఉంగుటూరు : న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
 
19. ఏలూరు : రెడ్డి అప్ప‌ల‌నాయుడు
 
20. తెనాలి : నాదెండ్ల మ‌నోహ‌ర్‌
 
21. గుంటూరు వెస్ట్‌ : తోట చంద్ర‌శేఖ‌ర్‌
 
22. ప‌త్తిపాడు : రావెల కిషోర్‌బాబు
 
23. వేమూరు : ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
 
24. న‌ర‌స‌రావుపేట‌ : స‌య్య‌ద్‌ జిలానీ
 
25. కావ‌లి :  ప‌సుపులేటి సుధాక‌ర్‌
 
26. నెల్లూరు రూర‌ల్‌ : చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
 
27. ఆదోని : మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
 
28. ధ‌ర్మ‌వ‌రం : మ‌ధుసూద‌న్‌రెడ్డి
 
29.రాజంపేట‌ : ప‌త్తిపాటి కుసుమ‌కుమారి 
 
30. రైల్వే కోడూరు : బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
 
31. పుంగ‌నూరు : బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
 
32. మ‌చిలీప‌ట్నం: బండి రామ‌కృష్ణ‌