సంచలనం : జనసేన గుర్తు మారింది !

May 31, 2020

తెలుగు రాజకీయాల్లో కీలకంగా మారిన జనసేనకు పెద్ద ఝలక్ తగిలింది. ఆ పార్టీ ఓట్లను దెబ్బతీసే నిర్ణయం ఒకటి యాదృశ్చికంగా ఎన్నికల సంఘం తీసుకుంది. అయితే, ఇది అత్యంత ప్రభావవంతమైన నిర్ణయం కావడంతో జనసేన శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. రాబోవు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేనకు వేర్వేరు గుర్తులు దక్కాయి. అదేంటి... కేంద్ర ఎన్నికల సంఘం పర్మనెంట్ గుర్తు ఇచ్చింది కదా అని అనుకోకండి. ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది.
పార్టీ పెట్టిన ఐదేళ్ల త‌ర్వాత ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన జ‌న‌సేన‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసును ఎన్నిక‌ల సింబ‌ల్ గా ఖ‌రారు చేసిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల ముగిసిన ఏపీ ఎన్నిక‌ల్లో అదే గుర్తుతో ఆ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేశారు. అందరికీ తెలిసిన గుర్తుకావడంతో చాలా సులువుగా అది ప్రజల్లోకి వెళ్లింది. ఏపీలో ఎన్నిక‌లు అలా ముగియ‌గానే... తెలంగాణ‌లో మరో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దురదృష్టవశాత్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు గుర్తులు వచ్చాయి. గాజు గ్లాసు అలాగే ఉంది. దాంతో పాటు క్రికెట్ బ్యాటు గుర్తు కూడా వచ్చింది. రెండు ఎన్నిక‌లు ఒకేసారి జ‌రిగినా... వేర్వేరు బ్యాలెట్ పేప‌ర్లే వాడతారు. అన్ని పార్టీలకు ఒకే సింబల్ ఉన్నా జనసేనకు మాత్రం ఈ రెండు ఎన్నికలకు వేర్వేరు గుర్తులు వచ్చాయి. ఇప్ప‌టికే త‌మ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసును జ‌డ్పీటీసీ అభ్య‌ర్థుల‌కు, కొత్త‌గా కేటాయించినా క్రికెట్ బ్యాట్ గుర్తు ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌కు ఉంటుంద‌ని... ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని జనసేన ప్ర‌జ‌ల‌ను కోరింది. ఈ మార్పునకు కారణం ఏంటంటే... ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు గాజు గ్లాసు సింబలే లేదట. అందువల్ల జనసేన ఇంకో సింబల్ ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో క్రికెట్ బ్యాట్ గుర్తు వారికి దక్కింది. అయితే... ఈ కన్ఫ్యూజన్ వల్ల జనసేన కొన్ని ఓట్లు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. 

RELATED ARTICLES

  • No related artciles found