జనసేన సంచలన నిర్ణయం

May 27, 2020

వైసీపీని ఎదుర్కోవడంలో తెలుగుదేశం చేయలేని పని జనసేన చేస్తోంది. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో అధికారంలో ఉన్నా కూడా గతంలో టీడీపీ ఘోరంగా విఫలమైంది. న్యాయపోరాటం చేయడంలోనూ విఫలమైంది. ఆ ఫలితమే అధికారం చేజారిపోవడం. అయినా ఇంకా మేలుకోలేదు టీడీపీ. కానీ ఏ అనుభవం లేని జనసేన వైసీపీ వ్యూహాలను చేధించడానికి సిద్ధమైంది.

ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పవన్ కళ్యాణ్ కు అమరావతిలో 62 ఎకరాల పొలం ఉందని అమాయకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కుట్రపూరిత వ్యూహానికి జనసేన చెక్ పెట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధికారకంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాని సారాంశం ఏంటంటే... తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి న్యాయపోరాటం ద్వారా అడ్డుకట్ట వేయడం. 

 

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ జనసేన న్యాయపోరాటంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధికారిక ప్రకటనలో ఇలా ఉంది. 

జనసేనకు ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక నీచ బుద్ధితో మాపై బురద జల్లడానికి కొందరు ప్రజావ్యతిరేకులు కుట్రలు పని తమ అనుచరగణంతో వాటిని అమలు చేస్తున్నారు. రాజధాని అమరావతిని తరలించొద్దని జనసేన చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేని వారు పవన్ కళ్యాణ్ కు 62 ఎకరాలు ఉన్నట్టు తప్పడు పత్రాలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయాలని జనసేన పార్టీ న్యాయవిభాగం నిర్ణయించింది. తప్పుడు ప్రచారం చేసిన వారందరికీ రెండు మూడు రోజుల్లో నోటీసులు పంపుతాము అని జనసేన పేర్కొంది.