శిరీష రెడ్డి చేసిన పనికి ఫిదా అయిన పవన్

June 05, 2020

కొద్దిసేపటి క్రితం పవన్ ఒక ఫొటో షేర్ చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జనసేన వీర మహిళ నెల్లూరు జిల్లాకు చెందిన శిరీష రెడ్డి పవన్ దృష్టిని ఆకర్షించారు. ఈ కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి ముందుండాలని పవన్ జనసైనికులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ నేత అయిన శిరీష రెడ్డి పవన్ పిలుపుతో పార్టీ తరఫున పేదల కోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు. 

జనసేన తరఫున పేదలకు పంచడానికి ఆమె, ఇతర జన సైనికులతో కలిసి పెద్ద ఎత్తున కూరగాయలు తెప్పించారు. ఆ లోడును పార్టీ ఆఫీసు వద్ద దించడానికి కూలీలు ఎవరూ లేరు. దీంతో జన సైనికులే ఆ పని చేశారు. అందులో శిరీష రెడ్డి అనే యువతి చాలా చురుకుగా అక్కడ భారీ బరువులను కూడా అవలీలగా మోయడం పవన్ ను విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫొటో ఎవరో పవన్ కి పంపారు. దానిని పవన్ షేర్ చేస్తూ 

‘‘కరోనా లాక్ డౌన్ వలన నిరాశ్రయులైన పేదలకు నిత్యావసరాల పంపిణీ కోసం కాయగూరలు ఆటో నుంచి ఇంట్లోకి మోస్తున్న జనసేన వీర మహిళ శిరీష రెడ్డి గారు‘‘ అంటూ షేర్ చేశారు. దీనిని కొన్ని వేల మంది ఇష్టపడ్డారు. ఆమెను అభినందనలతో ముంచెత్తారు. నిజానికి శిరీష చేసిన పని అక్కడున్న వారిని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. పబ్లిసిటీ కోసం కాకుండా మనసుతో , ఇష్టంతో ఇలా చేసే వారు అరుదే. దీనిని రీట్వీట్ చేసిన చింతమరెడ్డి శిరీషరెడ్డి... మీరిచ్చిన మనోబలంతో మేము ఏమైనా చేయగలం అన్నయ్యా అంటూ కృతజ్జతలు తెలిపింది.