జనసైనికులు ఇక రెచ్చిపోవచ్చు

July 04, 2020
CTYPE html>
ఈ మధ్యే కాకినాడకు చెందిన వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్ మీటింగ్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బూతులు వాడారు. దీన్ని నిరసిస్తూ.. శాంతియుతంగా ఆందోళన చేయడానికి కొందరు జనసైనికులు ద్వారంపూడి ఇంటి వద్దకు వెళ్తే వాళ్లను తరిమి తరిమి కొట్టారు వైకాపా కార్యకర్తలు, నాయకులు. మహిళలని కూడా చూడకుండా వైకాపా వాళ్లు జనసేన మద్దతుదారులపై దాడి చేసిన తీరు దారుణమే. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను కూడా చొక్కా చిరిగేలా కొట్టి పంపించారు.
గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి జనసైనికులపై. పవన్ మీద అభిమానంతో జనసైనికులు ఏమీ ఆశించకుండా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. మిగతా పార్టీల వాళ్లలా వీరికి ఆర్థిక ప్రయోజనాలుండవు. అయినా పోరాడుతుంటే ప్రత్యర్థి వర్గం చేసే దాడులు చూసి జనసైనికులు కొంత బెదురుతున్న మాట వాస్తవం.ఇలాంటి తరుణంలో జనసేనకు బీజేపీ రూపంలో అండ లభించింది. ఆ పార్టీతో కలిసి సాగేందుకు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఏపీలో భాజపా అంత బలమైన పార్టీ ఏమీ కాదు. కానీ ఆ పార్టీకి ఒక నిర్మాణం ఉంది. ఆరేళ్లుగా కేంద్రంలో ఉండటం.. ఇప్పుడు కూడా కేంద్రంలో చాలా బలంగా ఉ:డటం భాజపాకు కలిసొచ్చే అంశం.
వైకాపా వాళ్లు భాజపా వాళ్లను చూస్తే ఎలా భయపడుతున్నారో తెలిసిందే. భాజపా వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా కిక్కురుమనరు. మోడీ, షాలను చూస్తే ఉన్న భయం అది. వైకాపా అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న కేసుల భయం దృష్ట్యా భాజపా మీద విమర్శలు చేసే.. గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఇలాంటి పార్టీ అండ ఇప్పుడు జనసేనకు లభించింది. ఇది జనసైనికులకు మనో ధైర్యాన్నిస్తుందనడంలో సందేహం లేదు. వారిలో గుండె ధైర్యం ఉంది కానీ.. తమకు ఏమైనా అయితే చూసుకుంటారనే ధైర్యం ఇన్నాళ్లూ లేకపోయింది. ఇప్పుడు భాజపా రూపంలో ఆ ధైర్యం లభించింది. ఈ అండతో వైకాపా వాళ్లను జనసైనికులు బలంగా ఢీకొడతారడనంలో సందేహం లేదు.