​పవన్ ఉంటాడో పోతాడో - జనసేన నేత హాట్ కామెంట్స్

July 03, 2020

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపుతీుకుంటున్నాయి. అధికారం లేకపోతే నాయకులు ఉండలేకపోతున్నారు. ఎంతో నమ్మకస్తులుగా ఉన్న వారు కూడా ఫ్లేటు ఫిరాయిస్తున్నారు. తాజాగా జనసేనలో రాజకీయ కుదుపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేత చేసిన కామెంట్లే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
‘‘కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదు. వచ్చే ఐదేళ్లలో పవన్‌ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పవన్‌కళ్యాణ్ తన ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు’’ అని జనసేన నేత ఆకుల సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తమది కాపు పార్టీ కాదు కాదు... అని అ పార్టీ నేతలకు కీలక పదవులు కట్టపెట్టారు. ఆఫీసు బయటా ఇదే జరిగింది. ఇపుడు దీనిపై బయట వాళ్లెవరూ మాట్లాడటం లేదు గాని సొంత పార్టీ నేతలే తప్పు పడుతున్నారు.
మరి సత్యనారాయణ కామెంట్లు ఆయన కొత్త దారిని వెతుక్కుంటున్న విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.