జగన్ వద్దకు జస్టిస్ జాస్తి...  ఎన్నెన్ని విశ్లేషణలో?

May 26, 2020
CTYPE html>
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ప్రముఖ న్యాయకోవిదుడు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిన్నటి పర్యటన అందరినీ షాక్ కు గురి చేసిందని చెప్పాలి. అంతేకాకుండా జస్టిస్ జాస్తి తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు లెక్కలేనన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయినా నిన్న జస్టిస్ జాస్తి పర్యటన ఏమిటన్న విషయానికి వస్తే... తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన జస్టిస్ జాస్తి... అక్కడ  వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. జస్టిస్ జాస్తి ఒక్కరే అక్కడికి వెళ్లి ఉంటే ఇంత పెద్ద సంచలనం అయ్యి ఉండేది కాదేమో తెలియదు గానీ.. జస్టిస్ జాస్తి వెంట.. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. జగన్ తో జస్టిస్ జాస్తి భేటీ కొద్ది నిమిషాల్లోనే ముగిసినా... జస్టిస్ జాస్తి లాంటి వ్యక్తులు సీఎం క్యాంపు కార్యాలయాలకు వెళ్లడం అంటే నిజంగానే ఆసక్తికరమే కదా.
 
అయినా జగన్ తో జస్టిస్ జాస్తి భేటీ ఎందుకన్న దానిపై ఇప్పుడు లెక్కలేనన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ చాలా ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో జగన్.. సీఎంగా ఉండి కోర్టుకు వెళ్లడం ఎలా అన్న మీమాంసలో ఉన్నారు. అంతేకాకుండా సీఎంగా తాను తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వ్యతిరేకిస్తుందన్న విమర్శల నేపథ్యంలో జగన్ ఏకంగా శాసనమండలినే రద్దు చేపి సారేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ కు మాత్రమే పరిమితంచేస్తూ..ఏపికి మూడు రాజధానులు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయం కూడా ఇంకా అమలు కానేలేదు. 
 
ఈ నేపథ్యంలో జస్టిస్ జాస్టి చలమేశ్వర్... నేరుగా సీఎం వద్దకు వెళ్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనపై నమోదైన ఆాదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి బయటపడే మార్గం సూచించమని జస్టిస్ జాస్తిని కోరేందుకే జగన్ ఆయనను తన వద్దకు పిలిపించుకున్నారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు వినిసిస్తున్నాయి. అదే సమయంలో ఏపీకి మూడు రాజధానులపై ఏర్పడ్డ అయోమయం నుంచి కూడా ఎలా బయటపడాలన్న విషయంపైనా జగన్ ఓ మంచి సలహా కోసమే జస్టిస్ జాస్తిని తన వద్దకు పిలిపించుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.. మొత్తంగా న్యాయ శాస్త్రంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న జస్టిస్ జాస్తి నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకే జగన్ ఆయనను తన వద్దకు పిలిపించుకుని మరీ మాట్లాడినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
 
ఇదిలా ఉంటే.. జగన్ వద్దకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వచ్చిన సందర్భంగా ఆయన వెంట యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్న విషయంపై మరో రకమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత సామాజిక వర్గానికి చెందిన యార్లగడ్డ, లావు... స్వయంగా అదే సామాజిక వర్గానికి చెందిన కీలక వ్యక్తి జస్టిస్ జాస్తిని వెంటబెట్టుకుని మరీ జగన్ వద్దకు వెళ్లడం వెనుక రాజకీయ కారణాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతి ఉద్యమంలో ఓ రేంజిలో ఉద్యమం చేస్తున్న చంద్రబాబు సామాజిక వర్గం ఐక్యతను బద్దలు కొట్టేందుకే జస్టిస్ జాస్తిని జగన్ వద్దకు యార్లగడ్డ, లావు లు తీసుకెళ్లారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.న్యాయ కోవిదుడిగా మచ్చలేని ప్రస్థానాన్ని కొనసాగించిన జస్టిస్ జాస్తిని ఈ విమర్శల్లోకి లాగలేం కానీ..., చంద్రబాబు సామాజిక వర్గం ఐక్యతను జగన్ దెబ్బ తీసేందుకు పన్నుతున్న వ్యూహాల్లో భాగంగానే ఈ భేటీ జరిగిందన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.