లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా ప్రసంగం వైరల్

July 05, 2020

దేశ సమగ్రత తెలుగుదేశం పార్టీకి అత్యంత ముఖ్యమైన విషయమని, అందుకే ఆర్టికల్ 370 నిర్వీర్యం చేయడం, జమ్మూకశ్మీర్ విభజనకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని లోక్ సభలో తెలుగుదేశం ఎంపీ జయగల్లా వ్యాఖ్యానించారు.
70 ఏళ్ల క్రితం జరిగిన చారిత్రక తప్పిదాన్ని ఈ ప్రభుత్వం సరిచేసిందని అభినందించారు. ఒకే దేశం..ఒకే జెండా..ఒకే రాజ్యాంగం నినాదానికి టీడీపీ ఎప్పటికీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయడం వల్ల ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆయన అన్నారు. కాశ్మీర్ లోయలో శాంతి నెలకొనడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు.
కశ్మీర్ పౌరుల అభివృద్ధి కోసం పెట్టిన స్వయం ప్రతిపత్తి దుర్వినియోగం అయ్యింది. ఇది శాశ్వత ప్రాతిపదికన చేసిన సవరణ కాదు. కానీ... 370 వల్ల మేలు కంటే చెడు వైపు కశ్మీర్ నడవడం మొదలుపెట్టింది, అందుకే ఈ నిర్ణయం కశ్మీర్ కు మేలు చేస్తుందని ఆయన అన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిస్థాయిలో విలీనం చేయడం ద్వారా కశ్మీర్‌లో పెట్టుబడులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తాయి. మౌలిక వసతులు పెరుగుతాయి. గిరిజనులు, మహిళలకు, యువతకు న్యాయం జరుగుతుంది. మహిళలు భారతీయులకు పెళ్లాడటానికి వెనుకాడేవారు. కానీ ఇపుడు ఆ సమస్య లేదు. ఎవర్ని పెళ్లాడినా వారి హక్కులు కోల్పోరు. ఇది కాశ్మీరీ యువతులకు భారత్ ఇచ్చిన బహుమతి అన్నారు. కశ్మీరులో వీలైనంత త్వరలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నాం అని గల్లా జయదేశ్ అన్నారు.