ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి ఇంట్లో విషాదం

June 06, 2020

అందరికీ సుపరిచుతుడైన ఎన్నారై... తానా ప్రముఖుడు జయరాం కోమటి తల్లి కమలమ్మ పరమపదించారు. ఆమె వయసు 85. అంతర్జాతీయ ఎమర్జెన్సీ వల్ల  దురదృష్టవశాత్తూ తల్లి చివరి చూపునకు నోచుకోలేని పరిస్థితి జయరాం కోమటికి ఎనలేని శోకాన్ని మిగిల్చింది. భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో తల్లి అంతక్రియలకు ఆయన హాజరు కాలేకపోతున్నారు.

కోమటి భాస్కరరావు, కమలమ్మల కుమారుడు జయరాం. ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే అమెరికాలో సెటిలయ్యారు. జయరాం తండ్రి కోమటి కోమటి భాస్కరరావు 1989లో మైలవరం ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన కొన్నేళ్ల క్రితమే మరణించారు. ఇపుడు తల్లి కమలమ్మ తుదిశ్వాస విడిచారు.  ప్రస్తుతం వారి స్వగ్రామం అయిన కృష్ణా జిల్లా మైలవరంలోనే ఆమె అంత్యక్రియలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు రద్దు కావడం వల్ల జయరాం కోమటి తల్లిని చివరి సారిగా చూసుకునే భాగ్యం కోల్పోయారు. తోటి ఎన్నారైలు కమలమ్మ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. జయరాం సోదడురు, సోదరి ఇద్దరు ప్రస్తుతం మైలవరంలోనే ఉంటున్నారు. వారి ఈ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.