ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోంది

February 25, 2020

జగన్ తన కంపెనీ కి చేసిన నష్టంపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోంది. పరిపాలన గురించి వారికి పట్టదు. అవసరం లేదు. ఈ రోజు నా కుటుంబ కంపెనీపై కక్షతో ఈ పనిచేశారు. నాకు తెలుసు. నష్టం జరిగింది. నేను కోర్టుకు పోతాను. కానీ రాష్ట్రానికి జరిగిన నష్టంతో పోలిస్తే ఇది పిసరంత కూడా కాదు. 

జగన్ పాలన వల్ల రాష్ట్రానికి ఊహకు కూడా అందనంత నష్టం జరుగుతోంది. బాధ్యతలేని వ్యవహారం. ఇది ఫ్యాక్షనిస్టు మనస్తత్వపు పాలన. నచ్చని వారిని అంతమొందించాలి. నష్టపోయిన వారు అడుక్కుతింటుంటే చూసి ఆనందించాలి ఇదే కదా వారు చేస్తున్నది. కాకపోతే వారి పగ... రాష్ట్రం మీద తీర్చుకోవడమే బాధాకరం. నన్ను నేను కాపాడుకోగలను. కానీ రాష్ట్రాన్ని ఎవరు ఎలా కాపాడతారో అర్థం కాని పరిస్తితి ఉంది. అలాంటి పరిస్థితి ఆయనకు ఓట్లేసి మనమే తెచ్చుకున్నాం అని జేసీ వ్యాఖ్యానించారు.

జగన్ జేసీపై తీర్చుకున్న రెండో పగ ఇది. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులపై  వైసీపీ సర్కారు ఆంక్షల కొరడా ఝళిపించింది. తాజాగా ఆయన గనులను రద్దుచేసింది.