జేసీ దివాకర్ రెడ్డి ని టార్గెట్ చేశారు

February 17, 2020

జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ పోలీసులు గుర్రుగా ఉన్నారు. పోలీసుల గురించి బహిరంగ వేదిక మీద ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. వాస్తవానికి ఆరోజు జేసీ మాటల్లో జగన్ పాలన బాగుంది అనే అర్థమే ఉంది. అయినా జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీకి గులాంగిరి చేస్తున్న కొందరు పోలీసులను తిడుతూ... అధికారం శాశ్వతం కాదు. ఐదేళ్లలో ప్రభుత్వం మారుతుంది. ఆ తర్వాత మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుని మీ భరతం పడతాం అన్నారు. పోలీసులతో నా బూట్లు నాకిస్తా అని ఆయన వ్యాఖ్యానించలేదు. బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటాను అని (తాను ఏం చెబితే అది వినేవారిని అనే అర్థంలో) జేసీ ఆ వ్యాఖ్యలు చేశారు.

అయితే, తెలుగుదేశం వారు ఎక్కడ దొరుకుతారా రెచ్చిపోదామా అని ఆలోచిస్తున్న వైసీపీ ప్రభుత్వం, పోలీసులు జేసీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. వీటి గురించి అనంతపురం డీఎస్పీ మాట్లాడుతూ జేసీపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అన్నిటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే... వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు పోలీసులను అవమానిస్తూ జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు పోలీసులను నమ్మను అన్నాడు. అడగడుగునా ఏపీ పోలీసులను అవమానించారు. కానీ ఆనాడు చంద్రబాబు హయాంలో ఈ విషయంపై జగన్ పై గాని, వైసీపీ నేతలపై గాని పోలీసులు కేసులు పెట్టలేదు. అదే వైసీపీ హయాంలో పోలీసులు దివాకర్ రెడ్డిపై కేసులు పెడుతున్నారు. మరి ఇదే పోలీసులు వైసీపీ వారు ఆరోపణలు చేసినపుడు సైలెంటుగా ఎందుకున్నారు. ఇపుడు ఎందుకు రెచ్చిపోతున్నారు అనేది బ్రహ్మపదార్థమే.