జగన్ మహా అయితే ఆ పని చేస్తాడు అంతేగా- జేసీ

August 13, 2020

జేసీ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. నా వ్యాపారాలు సీజ్ చేశారు. నా బస్సులు సీజ్ చేశారు. తమ్ముడిని, అస్మిత్ ను అరెస్టు చేశారు. నువ్వెన్ని బంద్ చేసినా... నా ఊర్లో నాకు పదెకరాల పొలం ఉంది. అందులో చెట్ట కింద నులక మంచం వేసుకుని బతుకుతా.

మా ఆవిడ రోట్లో పచ్చడి నూరుతుంది. ఇంత అన్నం వండుకుని తింటాం. నాకు పెరుగు మజ్జిగ ఉంటే చాలు. వాటికి డబ్బులు అక్కర్లా... ఊర్లోకి పంపితే ఎవరో ఒకరు ఇంత ఇస్తారు. చాలు చల్లగా తిని బతుకుతా.

మహా అయితే... నువ్వు జైలుకు పంపిస్తావు. అంతకుమించి నువ్వు చేసేదేముంది?

నువ్వు ఇట్లావి ఎన్ని జేసినా.. తాడేపల్లికి వచ్చిన శరణు కోరేది లే. నీది కక్షి సాధింపు వ్యవహారం అని అందరికీ తెలుసు. ఎంతకాలం ఉంటావు నీవు? పైగా నీ పాలనంతా అప్పులు పాలు. ఎన్నాళ్లు పాలిస్తావు... రౌడీయిజం, అప్పులు. నువ్వేం చేసినా లొంగేది లేదు. 

నవరత్నాలను మోయాలంటే ప్రభుత్వ భూముల అమ్మకం తప్ప ఏం లేదు. అభివృద్ధి జీరో. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి అని జేసీ విమర్శించారు. 

జగన్ పాలన ఎంతో కాలం సాగేది కాదని అన్నారు.