TTD : జగన్ బండారం బయటపెట్టిన జేసీ

July 03, 2020

సొంత పార్టీ పై అయినా, ఎదుటి పార్టీపై అయినా తూటాల్లాంటి మాటలు పేల్చడంలో జేసీ దివాకర్ రెడ్డిది అందె వేసిన చేయి. తనకు ఏం నచ్చితే అది మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లు పార్టీలు, ప్రభుత్వాల రహస్యాలు బట్టబయలు చేసి గాలితీస్తుంటాడు కూడా. కానీ జేసీ ఎపుడు స్పందించిన మంచి హాట్ టాపిక్ ల మీద స్పందిస్తాడు.

మొన్న టీడీపీ ఇళ్లలో నిరసన తెలియజేయమంటే... ఇలాంటి నిరసనలను జగన్ పట్టించుకోడని డైరెక్టుగా చెప్పేశాడు. ఎన్నికల ముందు పొగిడే వాళ్లను పట్టించుకోకు బాబు, సిట్టింగులకు సీట్లు వద్దు అన్నా బాబు అపుడు వినలేదు. తాజాగా జగన్ పాలన గురించి కుండబద్ధలు కొట్టాడు. రాజ్యాంగం మీరితే టాపు లేచిపోద్ది, నిరంకుశ ధోరణి, పనికిరాని పట్టుదల జగన్ వదులుకోవాలని హితవు పలికారు.

మొన్న టీటీడీ భూముల అమ్మకం నిర్ణయం గురించి ఈ సందర్భంగా  జగన్ గుండె బద్దలయ్యే విషయం చెప్పాడు జేసీ రెడ్డి.  తిరుమల వెంకన్న ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ చేసిన నిర్ణయం బోర్డు నిర్ణయం అని అందూ అంటున్నారు. కానీ అది అవాస్తవం. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై శ్రీవారి భూములు అమ్మే ప్రక్రియకు ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.  

ఈ విషయంలో ఇంతవరకు ప్రభుత్వమే భూముల అమ్మకాన్ని ఆపినట్లు వైసీపీ ప్రచారం చేస్తోంది. మరి జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించిన ఈ విషయంపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.