పవన్ కళ్యాణ్ తిక్కోడు - జేసీ

February 17, 2020

పాపం... అందరూ పవన్ అభిమానుల ఓపికను పరీక్షిస్తున్నారు. పవన్ అభిమానులు ఎంతమందిని అని ఎదుర్కోవాలో వారికి అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ ను కెలుకుతున్నారు. తాజాగా పవన్ ను సాధారణంగా పట్టించుకోని జేసీ దివాకర్ రెడ్డి కూడా ఘాటు కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక తిక్క వ్యక్తి అనేశారు. ఇంతకీ ఆయన ఈ మాట ఎందుకు అన్నారంటే... పవన్ కళ్యాణ్ ఎపుడూ స్పందించినా... ఏం మాట్లాడినా... తాను కొత్త విషయం వెలుగులోకి తెస్తున్నట్లు, ఆ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియనట్లు మాట్లాడుతుంటారని.. అన్నారు. 

మరోవైపు జగన్ పాలనను బ్రిటిష్ పాలనతో పోల్చారు జేసీ దివాకర్ రెడ్డి. అమాయకులపై స్వతంత్రానికి ముందు ఎలా దాడిచేసేవారో ఈరోజు జగన్ సర్కారు అలా దాడిచేస్తోందన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా పోలీసులు కొట్టడం చూస్తుంటే... బ్రిటిష్ రాక్షసత్వం జగన్ లో కనిపిస్తోందన్నారు. 

ఇక రాజధాని గురించి ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ తీర్పును గౌరవిస్తున్నాం. అది పౌరుల బాధ్యత. అయితే, ఇక్కడితో అంతా అయిపోయినట్టు కాదు. కోర్టులు ఉన్నాయి. తమకు కేంద్రం ఉందన్నారు. జగన్ తాను ఏమనుకుంటే అది జరగాలని అనుకుంటున్నారని అదిసాధ్యం కాదన్నారు. జేసే మాటలు చూస్తుంటే... రాజధాని విషయంలో జగన్ కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.