జగన్ కు 150 మార్కులేస్తా...

April 04, 2020

జేసీ దివాకర్ రెడ్డి...కి మీడియా అవసరం లేదు

మీడియాకు మాత్రం జేసీ దివాకర్ రెడ్డి అవసరం. 

ఇది కేవలం అతని మాట తీరు. ఎవరిని అయినా క్యాజువల్ గా ఫుట్ బాల్ ఆడేస్తుంటారు. ఓపెన్ గా మనసులో మాట చెప్పే జేసీని పొలిటికల్ ఆర్జీవీ అనొచ్చు. తన సొంత పార్టీకి అయినా బహిరంగ సూచనలు చేయగలిగిన నేత. తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలకు అతని ఆటిట్యూడ్ సరిపోదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశంలో చేరారు. అయినా... క్యాస్ట్ ఫీలింగ్ తో జగన్ మా వాడే, జగన్ మా వాడే అంటుంటారు. ఆ విషయాన్ని కూడా జేసీ దాచుకోరు. 

ఇదిలా ఉంటే... ఇటీవలే జగన్ జేసీ కి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. దాదాపు 31 బస్సులను సీజ్ చేశారు. దీనిపై జేసీ స్పందిస్తూ... రాష్ట్రంలో వందల ప్రైవేటు ట్రావెల్స్ ఉంటే...దివాకర్ ట్రావెల్స్ మాత్రమే ప్రభుత్వానికి కనిపించాయా? కేవలం భూతద్దంలో పెట్టి చూశారు అంతే. ట్రావెల్స్ బిజినెస్ లో చిన్న చిన్న లోపాలుంటాయి. ఆ మాటకొస్తే... ఆర్టీసీలోనూ ఇదే లోపాలుంటాయి. అది కూడా ట్రావెల్సే. కాకపోతే గవర్నమెంటుది. అంతే తేడా. అందుకే చెబుతున్నా... జగన్ పాలన జనరంజకంగా ఉందంటూ... సెటైర్ వేశారు జేసీ. కొందరి అహాన్ని తృప్తిపరచడానికి చేసిన నిర్ణయం అన్నట్లు జేసీ మాట్లాడారు. 70 ఏళ్ల నుంచి ఇదే బిజినెస్. మాకు లోటుపాట్లు తెలుసు. ఎవరూ సరిదిద్దుకోలేని చిన్న చిన్న పొరపాట్లను చూపి బస్సులను సీజ్ చేశారు అన్నారు జేసీ. 

చంద్రబాబు గురించి ఏమేమో మాట్లాడుతున్నారు. వీళ్ల హయాంలో వానలు తెగ కురిశాయట. చంద్రబాబు కట్టిన ప్రాజెక్టులు లేకుండా ఆ నీళ్లు యాడ పెట్టుకుంటారు ? అని ప్రశ్నించారు జేసీ. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వాటిలో ఇపుడు పడిన వాన నీటిని దాచుకోవడానికి కూడా వీరు ఆపసోపాలు పడుతున్నట్లు విమర్శించారు జేసీ.