మాకూ టైమొస్తుంది జగన్ - జేసీ పవన్ రెడ్డి

August 07, 2020

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేనన్ని కేసులు దివాకర్ ట్రావెల్స్ పై నమోదవుతున్న సంగతి తెలిసిందే. మోసగాళ్లని అరెస్టు చేయాల్సింది పోయి బాధితులను అరెస్టు చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటో మాకు స్పష్టంగా తెలుసు. మాకూ టైమొస్తుంది, అపుడు చూసుకుందాం అని జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని హెచ్చరించారు. 

ఏజెంట్లు మాకు తప్పుడు వాహనాలు అంటగడితే మేము మోసపోయామని నాగాలాండ్ ప్రభుత్వానికి, డీజీపీ కి ఫిర్యాదు చేశం. మేము ఆ వాహనాల విషయంలో బాధితులమే గాని, మోసగాళ్లం కాదు... జగన్ కక్షతో ఇలా చేస్తున్నారు. కోర్టులో మాకు న్యాయం జరుగతుందని పవన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే జగన్ కోర్టుల్లో అనేక కేసుల్లో ఎదురుదెబ్బలు తిన్నారు. ఇంకా తింటారు. మాకు కోర్టులో న్యాయం జరుగుతుంది అని జేసీ పవన్ వ్యాఖ్యానించారు.

మా నాన్ననీ నన్ను జగన్ అరెస్టు చేయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇవే మాటలన్నారు... జగన్ చేతిలో అధికారం ఉంది... మాపై కక్ష తీర్చుకుంటున్నారు అని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. 

లోకేష్ పర్యటనతో తెలుగుదేశం బలం తెలియకుండా చేయడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. గుత్తి మండలం, కొత్తపేటలో టీడీపీ కార్యర్తలను, వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ రాక సందర్భంగా వీరు అక్కడకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.