జేసీ పవన్ రెడ్డి... మనోడిలో చాలా విషయం ఉంది

August 08, 2020

డబ్బున్న వారు చాలామంది ఉన్నారు. కానీ కేవలం డబ్బుంటే రాజకీయాల్లో ఎదగలేం. రాజకీయాల్లో ఎదగాలంటే కొన్ని లక్షణాలుండాలి. ఎవరికైతే ఆ లక్షణాలు ఉంటాయో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.  

మాటలో స్పష్టత.

చెప్పేదానిలో విషయం.

ఎదుటి వాడు ప్రశ్నలు వేయడానికి ఆలోచించేలా మన వెర్షను తయారుచేసుకోవాలి.

వీటన్నింటికి మంచి ఎంత పెద్ద ఉత్పాతం వచ్చినా దానిని తట్టుకోగలరు అన్న భరోసా మనల్ని చూసే వారికి అర్థం కావాలి. 

ఇవన్నీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డిలో కనిపిస్తున్నాయి. 

మీకు అనిపించవచ్చు... డబ్బులుంటే అన్నీ వస్తాయని... ఒకసారి ఏపీలో డబ్బులున్న నేతల పుత్రరత్నాలు ఎలా ఉన్నారో ఆలోచించండి. అపుడు పవన్ రెడ్డి లోని క్వాలిటీలు మీకు అర్థమవుతాయి. 

ఒక్కసారి ఈ ప్రెస్ మీట్ చూడండి

హావభావాల్లో గాని... స్వరంలో గాని, ఎదుటి వాడికి చేరేలా చెప్పడంలో గాని ఎంత క్లారిటీగా ఉన్నాడో అర్థమవుతుంది. అనుచరులకు కూడా ఇతనితో ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుంది అనేలా ఉండాలి. అచ్చం అలాగే ఉన్నాడు పవన్ రెడ్డి.