జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టు.. ఏ కేసులో?

August 05, 2020

మాజీ మంత్రి.. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోనే టీడీపీకి చెందిన మరో అగ్రనేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే బాగా పాపులర్ అయిన రాజకీయ నాయకులుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టును ప్రకటించారు.

రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతూ ... నిత్యం ప్రజాదరణ పొందుతున్న ఎర్రన్నాయుడు కుటుంబంపై ముద్ర వేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించడం బ్యాక్ ఫైర్ అవడం తెలిసిందే. అయితే, దీనిని కవర్ చేసుకోవడానికి ఈరోజు జగన్ సర్కారు ఒక అగ్రకుల వ్యక్తిని అరెస్టు చేసింది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో జేసీ అరెస్టు ఊహించిందే. కానీ ఏ విధంగా చూసినా అచ్చెన్నాయుడు అరెస్టు విస్మయమే. జేసీ అరెస్టును అదేపనిగా అచ్చెన్నాయుడి అరెస్టును కవర్ చేసుకోవడానికి వైసీపీ ప్రయోగించందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

వరుస అరెస్టులు ఏపీలో హాట్ హాట్ గా మారిపోయాయి.  బీఎస్3 వాహనాల్ని బీఎస్4 వాహనాలుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేసి అమ్మినట్లుగా వీరి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.  ఈ తీరులో దాదాపు 154 వాహనాల్ని నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా గుర్తించారట. వీటికి ఫేక్ ఎన్వోసీ.. ఫేక్ ఇన్యూరెన్సుల్ని దాఖలు చేసిన నేరాల్లో వీరిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.