పోలీసులకు ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చి జేసీ ఫ్యామిలీ

July 04, 2020

రాజకీయాల్లో నిర్భయంగా మాట్లాడగలిగిన నైజం జేసీ సోదరులది. రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా ఎంతమాటయినా అనగలిగిన నేతలు వాళ్లే. గత నెలలో పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆయన సోదరుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు మరో వార్నింగ్ ఇచ్చారు.

పోలీసులకు చెబుతున్నా. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి టీడీపీ కార్యకర్తకు మేము అండగా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే... మా వారిపై అక్రమ కేసులు పెట్టిన ప్రతి పోలీసును జైలుకు పంపుతాం.  మేము అధికారంలోకి రావొద్దని పోలీసులు దేవుడికి గట్టిగా మొక్కుకోవాలని అని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలీసుల యాక్షన్‌కు మా రియాక్షన్‌ చాలా గట్టిగా ఉంటుందన్నారు. పోలీసులు తాము  సుప్రీం అనుకుంటున్నారేమో వారు ’కేసులు పెట్టి లోపలేయడం తప్ప... ఏం చేయలేరు’ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు.