బీజేపీకి ఇది భారీ షాకే !!

June 01, 2020

మహారాష్ట్ర ఎపిసోడ్ లో అవమానంతో చావు తప్ప కన్నులొట్టపోయిన బీజేపీకి జార్ఖండ్లో ఏకంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. 81 అసెంబ్లీ సీట్లు ఉన్న జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 సీట్లలో గెలవాలి. కానీ ఏ ఎగ్జిట్ పోల్ లోనూ బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని చెప్పడం లేదు. జాతీయ ఛానెల్ నుంచి జార్ఖండ్ లోకల్ చానెల్ వరకు అందరూ బీజేపీ ఓడిపోతుందనే చెబుతున్నారు. అలాగని... మహారాష్ట్ర, కర్ణాటకలలో లాగా మెజారిటీ సీట్లు కూడా బీజేపీకి రావడం లేదు. ఎన్నికల ముందు ఉన్న కూటమి అయిన కాంగ్రెస్ కూటమికి సంపూర్ణ మెజారిటీ దక్కేలా ఉందని చెబతున్నాయి ఎగ్జిట్ పోల్స్. కాంగ్రెస్ కూటమిలో ఆర్జేడీ, జేఎంఎం ఉన్నాయి. 

  • ఏబీపీ సీఓటరు కాంగ్రెస్ కూటమికి 35 సీట్లు, అధికార బీజేపీకి 32 సీట్లు మిగతావి ఇతరులకు చెప్పింది.
  • ఆజ్ తక్ కాంగ్రెస్ కూటమికి 38-50 సీట్లు, బీజేపీకి 22- 32 సీట్లు వస్తాయంది.
  • లోకల్ ఛానెల్ న్యూస్ XI బీజేపీకి 35 సీట్లు దాటవు. కూటమికి మెజారిటీ వస్తుందని చెప్పింది. 
  • టైమ్స్ నౌ కషిప్ బీజేపీ- 28, కాంగ్రెస్ కూటమికి- 44 సీట్లు వస్తాయని చెప్పింది.

అంటే.... సరిగ్గా దేశం క్యాబ్ బిల్లుతో భగ్గుమంటన్నపుడు ఇలాంటి ఫలితాలు బీజేపీకి కొంచెం ఎంబరాసింగ్ గానే ఉంటాయి.