అంబానీ అడ్డంగా బుక్కయ్యాడు... కస్టమర్లా మజాకా !!

August 15, 2020

బాహుబలిలో ’దండాలయ్యా‘... సాంగ్ గుర్తుందా? 

ఆ పాటతో ముఖేష్ అంబానీని కీర్తిస్తూ ఏకంగా స్పూఫ్ చేశారు జియో అభిమానులు. మాకు కావల్సినంత ఇంటర్నెట్ ఇచ్చావు, అడక్కుండానే ఫ్రీ కాల్స్ ఇచ్చా వద్దన్నా వాడుకోమన్నావు అంటే నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ లెవెల్లో కవితలు కూడా రాశారు. కానీ అదే మనుషులు నేడు జియోని తిడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే... ఇదంతా జియోనెట్ వాడి చేస్తున్నారు. ఇంతకాలం ఫ్రీగా ఇవ్వడమే ఇపుడు తిట్లకు కారణం. జనాలకు ఇంతకాలం కృతజ్జత ఇచ్చిన ఫీలింగ్ లేదు. ఇన్నాళ్లు వల వేసి ఇపుడు డబ్బులు దొబ్బుతున్న ఫీలింగ్ ఉంది.

ఇంతకీ ఏం జరిగిందంటే... ఇక నుంచి ఫ్రీ కాల్స్ జియోకు మాత్రమే. ఇతర నెట్ వర్క్ కు ఫోన్ చేసి మీరు గంటలు గంటలు మాట్లాడితే మాకు వాచిపోతుంది. అందుకే నిమిషానికి 6పైసలు కట్టండి అంటూ కస్టమర్లకు చెప్పేసింది జియో. మీ తరఫున మేము కడుతున్నాం. ఇంక ఆ భారం మోయలేం. మీరే మోసుకోండ అని ప్రకటించింది. అయితే.... మీరు ఎంత డబ్బులు కడితే అంత ఎక్స్ ట్రా ఇంటర్ నెట్ ఫ్రీ ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను అంటోంది. జియో తీసుకున్న ఈ నిర్ణయం తప్పేం కాదు గాని... ఇంత కాలం అన్ లిమిటెడ్ ఫ్రీకాల్స్ మరిగిన కస్టమర్లు ఈ వార్తను తట్టుకోలేకపోతున్నారు. అందుకే ట్రోల్ చేస్తున్నారు. 

ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి #BoycottJio అంటూ ట్విట్టరులో ట్రెండ్ అవుతోంది. జియో లాంచ్ అపుడు అంబానీ మేము ఎప్పటికీ కాల్స్ కి చార్జ్ చేయం అని మాట ఇచ్చిన వీడియోను ఇపుడు ట్రెండ్ చేస్తున్నారు. చాలామంది మేము పోర్ట్ పెట్టుకుంటాం అని జియోను బెదిరిస్తున్నారు.