ట్రంప్ ఇచ్చిన షాక్ - ఓ రేంజ్ పొలిటికల్ కామెడీ !

August 07, 2020

ట్రంప్ ను జీర్ణించుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి అతని స్పందన ఊహించలేం. అమెరికా చరిత్రలో తక్కువ ఓట్లు వచ్చి టెక్నికల్ గా గెలిచిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్. ఇక తాజాగా ఏడాది చివర్లో ఎన్నికలకు ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టిన ట్రంప్... ప్రత్యర్థి గురించి ఎవరూ చెప్పని మాటను చెప్పాడు. 

తన ప్రతర్థిగా బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి బిడెన్ ఎన్నికల్లో గెలుస్తాడు అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యంగంగా కూడా తన ప్రత్యర్థి గురించి ఎవరూ ఇలా మాట్లాడరు కదా. అదే మరి ట్రంప్ స్పెషాలిటీ. అందరూ ఊహించినట్లు స్పందిస్తే ఆయన ట్రంప్ ఎందుకు అవుతాడు.

ఇక అదే సందర్భంలో బిడెన్ గురించి ఆయన ఏమన్నారంటే...

తనతో పోటీ పడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ జో బిడెన్ మంచి వ్యక్తా? కాదా? అన్నది పక్కన పెట్టండి. నాయకుడికి ఉండాల్సిన బేసిక్ లక్షణమే ఆయనకు లేదు. స‌రిగ్గా మాట్లాడలేని నేత దేశానికి అధ్య‌క్షుడు కావ‌డం ఎంత‌వ‌ర‌కు సరైనది? ఇది ప్రజలే నిర్ణ‌యించుకోవాలని సూచించారు. జోడెన్ సరిగ్గా రెండు వాక్యాలను పలకలేరు.  

మరి జోబిడెన్ ఎందుకు గెలుస్తారని  చెప్పారు అంటే...  తాను ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా కోసం అంతా మంచే చేశాను. అయినా దేశ అధ్యక్షుడిగా తనను కొంత‌మంది ఇష్ట‌ప‌డ‌టం లేదు. అందుకే ఈ సారి అమెరికా అధ్య‌క్షుడిగా బిడెన్‌ గెలుస్తారని అని అన్నారు. 

కరోనా కు మరో కొత్త పేరు పెట్టారు ట్రంప్. చైనాను మరింత గిల్లేలా ఉందా పేరు. 'చైనా ప్లేగు' గా అభివర్ణించారు. ఆ వైరస్‌ అమెరికాలోకి రాకముందు వరకు తన పాలన వల్ల దేశంలోని యువతకు ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలు వచ్చాయి.  అమెరికా చరిత్రలో అత్యధిక ఆర్థికాభివృద్ధిని సాధించింది అని వివరించారు.