అతనికి ఆరో పెళ్లి.. ఆమెకు ఐదో పెళ్లి.. 12 రోజులకే విడాకులు

July 05, 2020

ఆర్నెల్లకో.. ఏడాదికో మొబైల్ ఫోన్లు మారిస్తేనే.. వింతగా.. విచిత్రంగా చూస్తారు. అలాంటిది పెళ్లి విషయం ఎంత కరకుగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మారుతున్న కాలానికి తగ్గట్లు.. ఒక పెళ్లి ఫెయిల్ అయినా రెండో పెళ్లి విషయంలో గతంలో ఉన్న పరిస్థితులు లేవనే చెప్పాలి. అయితే.. హాలీవుడ్ లో మాదిరి ఐదో పెళ్లి..  ఆరో పెళ్లి లాంటి కాన్సెప్టులు లేవనే చెప్పాలి. అయితే.. తాజాగా హాలీవుడ్ లో ఇద్దరు సెలబ్రిటీల మధ్య జరిగిన పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సంచలనమైంది.
ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్ ను బేవాచ్ సీరియస్ స్టార్ పమేలా ఆండర్సన్ పెళ్లి చేసుకున్న వైనం ఇప్పటికే హాట్ న్యూస్ అయ్యింది. దీనికి మరింత మసాలా చేరింది. వీరిద్దరి పెళ్లే ఒక సంచలనం అనుకుంటే.. పెళ్లైన పన్నెండు రోజులకే వీరిద్దరు విడిపోయారన్న వార్త ఇప్పుడు హాలీవుడ్ లో అందరూ చర్చించుకునే విషయంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. వాస్తవానికి నిర్మాత జాన్ పీటర్స్ వయసుకు.. పమేలా అండర్సన్ వయసుకు సంబంధం లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే జాన్ ఐదు పెళ్లిళ్లు చేసుకోగా.. పమేలా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. తాజాగా వారు చేసుకున్న పెళ్లి జాన్ కు ఆరోది కాగా.. పమేలాకు ఐదోది. ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న పన్నెండు రోజులకే వీరు విడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ వార్తలకు స్పందించిన పమేలా చేసిన వ్యాఖ్యలు విడిపోయారన్న వాదనకు బలం చేకూరేలా ఉంది.
తన భర్త జాన్ కు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పిన పమేలా.. లైఫ్ లో ఒకరి నుంచి ఒకరు ఏం కోరుకుంటున్నారన్న విషయం తెలుసుకోవటం ముఖ్యమని.. దీని మీద క్లారిటీ రావటం కూడా తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఒకవేళ అలాంటి స్పష్టత రావాలనుకుంటే పెళ్లి చేసుకోకుండా కూడా ఉండొచ్చు కదా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మ్యారేజ్ సర్టిఫికేట్ రాక ముందే.. వీరిద్దరూ విడిపోవటం. దీంతో.. ఏం గొడవ జరిగి వీరిద్దరూ విడిపోయారన్నది హాలీవుడ్ ప్రముఖులకు ఒక పట్టాన అర్థం కావట్లేదట.