వర్మపై సినిమా... టైటిల్ పప్పు వర్మ !!

August 04, 2020

రాంగోపాల్ వర్మను టార్గెట్ చేయడం అంటే... అది మన సమయం వృథా చేసుకోవడం మినహా మరేం కాదు. ఎందుకంటే... అతను దేన్నయినా స్వీకరిస్తాడు. దేన్నయినా వాడుకుంటాడు. అన్నిటికీ తెగించి...మందు కోసం, మగువల కోసం బతుకుతుంటాడు. అలా అని వారి వెంటపడి బతిమాలే టైపు కాదు, తన లెక్కలేని తనమే, కాంట్రవర్సిజమే తన ఆస్తిగా... హాయిగా బతికేస్తాడు. అతను మాటలకు కోపం తెచ్చుకోవడం, అతని చేష్టలకు ఉడికిపోవడం వల్ల ... ఉడికిపోయిన వారు నష్టపోతారు గాని వర్మకు ఏం నష్టం కలగదు. సినిమా పరిశ్రమలో పాటల రచయితగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఆర్జీవీ ట్రాప్ లో చిక్కాడు. 

ఓ టీవీ ఛానెల్ లో వర్మ ట్రైలర్ పై ఆయన తన అభిప్రాయం చెప్పాడు. దానిని నిర్లక్ష్యం చేసినందుకు వర్మపై పది నిమిషాల సేపు జొన్నవిత్తుల విరుచుకుపడ్డాడు. జొన్నవిత్తుల చౌదరి అని కామెంట్ చేసినందుకు ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇదంతా ఒకెత్తు అయితే వర్మపై కోపంతో వర్మకు పప్పు వర్మ అని పేరు పెట్టాడు. అదే టైటిల్ తో పేరడీ సినిమా తీస్తాను అన్నారు. వర్మ వంటి వాడిని లెక్కచేయడమే  అతనికి గౌరవం ఇవ్వడంతో సమానం. కానీ ఎందుకో కూల్ గా ఉండే జొన్న విత్తులను కూడా కెలికాడు వర్మ. వర్మ మూలాన జొన్నవిత్తుల నిజంగానే నిర్మాత అవతారం ఎత్తేలా ఉన్నాడు. ఆయన ఆ ఆలోచన విరమించుకోవడమే మంచిదేమో. ఎందుకంటే జొన్నవిత్తుల డబ్బుతో దానిని వర్మ బాగా ఎంజాయ్ చేస్తాడు. వాడుకుంటాడు కూడా. సరే ఆ సంగతి తర్వాత... వర్మ గురించి జొన్నవిత్తుల చేసిన కామెంట్లు ఏంటో ఈ వీడియోలో చూడండి.