లాక్ డౌన్ పొడిగించాలని కోరిన తెలుగాయన

August 12, 2020

దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది... ఎంత నష్టమైనా లాక్ డౌన్ పొడిగించడం చాలా మంచిదని జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. అయితే... వలస కూలీలను మాత్రం వెంటనే వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్జప్తి చేశారు. ఎందుకు లాక్ డౌన్ పొడిగించాలి అన్నదానికి ఆయన ఓ విశ్లేషణ చేశారు.

దేశంలో తక్కువ కేసులు ఉండటం వల్ల తక్కువ నమోదు కాలేదు అని... తక్కువ మందికి టెస్టులు చేయడం వల్ల తక్కువ కేసులు నమోదు అయ్యాయయని జేపీ సూత్రీకరించారు. సదుపాయాలు పెంచుకుని వేగంగా టెస్టులు చేయాలని అపుడు చికిత్స త్వరగా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. దీనివల్ల ఎక్కువ మందికి వ్యాప్తి చెందకుండా ఆపగలమని ఆయన అభిప్రాయపడ్డారు. 

చాలా మంది అనేక పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని... ఇండియాలో వేడి ఎక్కువ కాబట్టి వైరస్ మాడిపోతున్నారని భ్రమపడతున్నారన్నారు. అది తప్పు అని... వైరస్ మన వాతావరణంలో కూడా మనగలుగుతుందని అన్నారు. అజాగ్రత్తగా ఉండకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కేంద్రం లాక్ డౌన్ పొడిగించడం వల్ల దీన్ని విజయవంతంగా అరికట్టే అవకాశం ఉంటుందని అన్నారు.