టైమింగ్ తో పవన్ ఏపీకి హీరో అయ్యాడు... !!

February 22, 2020

​బలం ఉన్నవాడో 

​డబ్బు ఉన్నవాడో

పవర్ ఉన్నవాడో విన్నర్ కాదు 
 
టైమింగ్ ఉన్నవాడు విన్నర్.
 
నాలుగైదు నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చర్యలతో ఏపీలో రియల్​ రంగం కుదేలైంది. సుమారు కోటి మందిక ిప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే భవన నిర్మాణ రంగానికి ప్రధాన వెన్నెముక ప్రకృతి ఇచ్చే ఇసుక. కానీ... దానిని అడ్డంగా ఆపేసి రాష్ట్ర అభివృద్ధిని పడకేయించారు ముఖ్యమంత్రి జగన్.  దీంతో అందరూ రోడ్డున పడ్డారు. ఈరోజు రేపు సర్దుకుంటుందని భావిస్తూ వస్తున్న సమస్య రోజురోజుకు పెద్దదై 36 మంది ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్లింది. దీనిపై ప్రతిపక్షాలు నిరసనలు మొదలుపెట్టాయి. రకరకగాలు పోరాటం చేశాయి. అందులో జనసేన కూడా ఉంది. అయితే... చొరవ తీసుకుని తాను ఓడిన వైజాగ్ లోనే పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కూలీల కోసం పెద్ద పోరాటానికి పిలుపునిచ్చారు. రాష్ట్రమంతటా వైరల్ అయ్యే స్థాయిలో చాలా ముందుగా లాంగ్ మార్చ్ కి ప్లాన్ చేశాడు పవన్. ఇది పవన్ తీసుకున్న సరైన నిర్ణయాల్లో ఒకటో. ఎందుకంటే... ప్రభుత్వం తప్పక పరిష్కరించాల్సిన స్థాయికి సమస్య వెళ్లిపోయింది. సరైన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు సమస్య తీవ్రతను పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా చెప్పగలిగాడు. దీంతో ఇసుక కష్టాలపై పోరాటాల రేసులో పవన్ కు వంద మార్కులు పడ్డాయి. లాంగ్ మార్చ్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద దుమారం రేపాయి. వాటిలో కొన్ని!
 
 
* ​ఇంత మంది రోడ్లు ఎక్కారంటే... ప్రభుత్వం సరిగ్గా పనిచెయ్యట్లేదని అర్ధం చేసుకోవాలి.​ నేను 10 మంది చనిపోయారనుకున్నా... కానీ 36 మంది అని తెలిసి కన్నీరు ఆగడం లేదు. ​
* ​మేము రోడ్ల మీదకు రాలేదు. మీ ప్రభుత్వ ​అసమర్థత మమ్మల్ని రోడ్ల మీదకు తెచ్చింది.
* కష్టనష్టాల మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో ఇక్కడకి ఇంత మంది నాయకులు ఎందుకు వచ్చారు? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది ఆగిపోతుంది కాబట్టే వారందరూ ఇక్కడికి వచ్చారు.
* వైసీపీ వాళ్ళు సమయం అడుగుతున్నారు. ఇప్పటి వరకు సమయం ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వ విధివిధానాలపై మాట్లాడలేదు. జగన్ అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్లి సినిమాలు చేసుకుంటాను. ​కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. ​
* సగటు రాజకీయ నాయకుడి పాలసీలు ప్రజలను ఇబ్బంది పెడితే సామాన్యుల నుండే నాయకులు పుడతారు.
* భవన కార్మికులు రోజు కూలీకి పనిచేస్తారు. వారివి చిన్న జీవితాలు. జగన్ గారిలా, వైసీపీ నాయకుల్లా వారి దగ్గర వేల కోట్లు లేవు.
* భీమవరం, గాజువాక లో ఓడిపోయాం..ఓటమి, గెలుపు కాదు, పోరాటమే మాకు తెలుసు..కార్మికులు కష్టాలు పడుతుంటే కన్నీరు తుడవడమే మాకు తెలుసు.
* వేల కోట్లు ఉన్నవాళ్ళకి కార్మికుల కష్టాలు తెలియవు. ఒక నిర్మాణం ఆగిపోతే ఆర్ధికంగా వెనకబడిపోతాం..
* నిర్మాణ రంగం చాలా కీలకమైనది. వారిని కాపాడుకోకపోతే మన జీవిత రథ చక్రాలు ఆగిపోతాయి. భవన నిర్మాణ కార్మికులు పని తప్పి ఇంకా ఏమీ అడగట్లేదు.
* వైసీపీ ప్రచారాలు విని ప్రజలు నన్ను ఓడిపోయేలా చేసారు. అయినా నాకు బాధ లేదు, ఇవన్నీ నేను భరిస్తాను..ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది.
* వైసీపీ పాలసీలు సరిగ్గా లేనప్పుడు ఎలా పరిపాలించగలరు? ఎంతో మంది జీవితాలు ఆధారపడ్డ ఇసుక ను కొన్ని రోజులు ఆపుతామంటే ఎలా?
* వైసీపీ లో ప్రజాస్వామ్యం లేదు, ఏకస్వామ్యం ఉంది...ఏకస్వామ్యం ఉంటే ప్రభుత్వాలు కూలిపోతాయి.
* మా ప్రభుత్వంలో అవినీతి లేదంటున్నారు. మీరు పని చెయ్యకపోతే అవినీతి ఎలా జరుగుతుంది? మీరు పని చెయ్యండి, అవినీతి జరుగుతుందో లేదో మేము చెప్తాము.
* ఒక కార్మికుడు సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి చనిపోయాడు, అంతకంటే దౌర్బాగ్యం ఏమైనా ఉంటుందా?
* భవన నిర్మాణ కార్మికుల సమస్యలకు సంబంధించి వైసీపీ కు రెండు వారాల గడువు ఇస్తున్నాం..వైసీపీ కు, నన్ను విమర్శించనివారికి పేరు పేరునా చెప్తున్నా..మీకు రెండే వారాలు గడువు ఇస్తున్నాము..వెల్ఫేర్ ఫండ్ ద్వారా భవన నిర్మాణ కార్మికుడికి 50000 ఇవ్వాలి..చనిపోయిన వారికి 500000 ఇవ్వాలి.
* రెండు వారాల్లో వారి సమస్యలు తీర్చకపోతే అమరావతి రోడ్ల మీద నేనే నడుస్తా..ఆరోజున పోలీసులనే పిలుస్తారో, లేక ఆర్మీ వాళ్లనే పిలుస్తారో! పిలవండి చూద్దాం..
* కూల్చివేతతో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం కూలిపోద్ది..మీరు ప్రజలను ఎలా అయితే చూస్తే వారు కూడా మిమ్మల్ని అలానే చూస్తారు..చర్యకు ప్రతి చర్య
* ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వాళ్ళని మ్యాన్ ఫ్రైడే అంటారు. ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి మన రాష్ట్రంలో ఉంది..తప్ప్పు చేసిన వాళ్ళకి ప్రజలను పాలించే నైతిక అర్హత ఉందా?
* రెండు వారాల్లోపు ప్రభుత్వం చర్యలు తీసుకొని పక్షంలో మరొక ప్రణాళిక రూపొందిస్తాము.
* ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులకు, సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం నాయకులకు ధన్యవాదములు
* చనిపోయిన 36 మంది కార్మికుల ఆత్మలకు శాంతి కలగాలి.​ ​