దర్శకేంద్రుడి ఇంటి గుట్టు రెండేళ్ల లేటుగా బయటకు

February 24, 2020

బాలీవుడ్ లో రోటీన్ గా ఉండే విడాకుల వ్యవహారాలు.. టాలీవుడ్ లో తక్కువే. టాలీవుడ్ లో లవ్ ట్రాకులు.. బ్రేకప్ ఎపిసోడ్లు లాంటి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక.. పెళ్లి చేసుకున్నారంటే అలా ఉండిపోతారంతే. నాటి నటులు కానీ.. నేటి తరంలోనూ విడాకులు లాంటివి చాలా తక్కువే కనిపిస్తాయి. అందుకు భిన్నంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖుడిగా పేరున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంటికి సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది.
ఆయన కుమారుడు ప్రకాశ్ కొవెలమూడి విడాకులు తీసుకున్నారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. మీడియాలోనే కాదు.. ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారాన్ని తాజాగా ఇంగ్లిష్ వెబ్ సైట్లు ప్రముఖంగా ప్రచురించాయి. ప్రకాశ్.. కనికా జంట విడిపోయారన్న వార్తను తాజాగా బయటపెట్టాయి. వీరిద్దరూ కలిసి పని చేసిన తాజా చిత్రం జడ్జిమెంట్ హై క్యా షూటింగ్ ప్రారంభానికి ముందే వీరిద్దరూ విడిపోయినట్లుగా చెబుతున్నారు.
బ్రేకప్ అయి రెండేళ్లు అవుతున్నా.. సినిమా కోసం మాత్రం కలిసి పని చేసినట్లుగా చెబుతున్నారు. జడ్జిమెంటల్ హై క్యా సినిమాకు ముందే.. అంటే 2017లోనే తామిద్దరూ విడిపోయినట్లుగా పేర్కొనే ఒక ప్రకటనను సదరు ఆంగ్ల మీడియా ప్రచురించింది. ఏదో గాలికి అన్నట్లు కాకుండా.. ఇదే విషయాన్ని సదరు మీడియా సంస్థ ప్రకాశ్ నుంచి వివరణ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాను హైదరాబాద్ లో సెటిల్ అయ్యానని.. కనికా మాత్రం రెండేళ్ల క్రితమే ముంబయి షిఫ్ట్ అయినట్లుగా పేర్కొన్న ప్రకాష్ విడాకులు తీసుకున్నట్లుగా మాత్రం పేర్కొనకపోవటం గమనార్హం. ఇదే అంశం మీద కనిక మాత్రం రియాక్ట్ కాలేదన్న మాట వినిపిస్తోంది. మరి.. విడాకులపై వస్తున్న వార్తపై ఈ జంట అధికారికంగా ఇప్పుడైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.