దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌లో..ఇంత జ‌రిగిందా?

April 04, 2020

దేశం మ‌రోమారు తెలంగాణ వైపు చూసింది. దిశ నిందితులైన A1ఆరిఫ్, A2జొల్లు శివ, A3జొల్లు నవీన్, A4చెన్నకేశవులు  ఎన్‌కౌంటర్ అయ్యారు. పోలీసులు ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ప్ప‌టికీ....అన‌ధికారికంగా వివ‌రాలు వైర‌ల్ అయ్యాయి. హైదరాబాద్‌లో డాక్టర్‌ను చంపిన నిందితులను సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడి నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో.. పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు.
దిశా ఘటనపై విచార‌ణ విష‌యంలో పోలీసులు అన్ని ర‌కాలుగా వేగంగా స్పందిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను చర్లపల్లి జైలునుంచి గురువారం అర్ధరాత్రి తర్వాత సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ కోసం తీసుకువెళ్లారు. ఈ త‌రుణంలో అక్క‌డ నిందితుల‌ను విచార‌ణ చేస్తుండ‌గా...వారు పారిపోయేందుకు య‌త్నించ‌డం, రాళ్లు రువ్వ‌డంతో ఈ మేర‌కు కాల్పులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అయితే, అధికారికంగా పోలీసులు వెల్ల‌డించే నిర్ణ‌యం కోసం ఆస‌క్తి నెల‌కొంది. కాసేప‌ట్లో సీపీ స‌జ్జ‌నార్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించనున్నారు.
కాగా, దిశ కేసులో గురువారం క్లూస్ టీం కంటికి కనిపించని సూక్ష్మఆధారాలను సేకరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సూపర్ లైట్స్ (హై ఇంటెన్సివిటీ లైట్స్)ను వినియోగించారు. మృతదేహాన్ని తరలించిన లారీక్యాబిన్‌లోని ఒక మూలను సుమారు గంటపాటు శోధించి అతి సూక్ష్మమైన ఆధారాలను సేకరించారు. వాటిని విశ్లేషణ కోసం ఫోరెన్సిక్‌కు పంపించాయి.