టీడీపీ రౌడీయిజం మీరు తట్టుకోలేరు 

June 02, 2020

వైసీపీ ప్రజల మనసు గెలవడం ద్వారా మళ్లీ ఏపీలో గెలవాలి అనుకోవడం లేదు. ఇంకో పార్టీ బతక్కుండా, జనాలకు తెలియకుండా చేయడం ద్వారా మాత్రమే మళ్లీ తాము గెలవగలం. ఇంకో పార్టీ ఉంటే వైసీపీకి బుద్ధుంటే ఇంకోసారి ఎవరూ ఓట్లు వేయరు అని భావిస్తున్నట్లు ఆ పార్టీ చర్యల ద్వారా అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంది వైసీపీ. దీనికోసం ప్రత్యేక విభాగాలు ఎక్కడికక్కడ మెయింటెయిన్ చేసి కార్యకర్తలను మోపు చేసి తెలుగుదేశం కార్యక్రమాలను అడ్డుకుంటోంది. 

తాజాగా ఈరోజు లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. మొన్నటి విశాఖ పర్యటనలాగే మంగళవారం లోకేష్ కాన్వాయిని అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో వారు లోకేష్ కాన్వాయికి అడ్డం పడ్డారు. అయితే, వాగ్వాదం తర్వాత తెలుగుదేశం పార్టీ యాత్ర కొనసాగింది. ప్రజాస్వామ్యం బతకకూడదని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని, ఏ పార్టీ అయినా ఏ కార్యక్రమం అయినా చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని... కానీ ఇది జగన్ జాగీరు అని వైసీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. 

ఈ రోజు పర్యటనపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ చాలా సీరియస్ గా స్పందించారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో వైసీపీ మూకలు అల్లర్లకు ప్లాన్ చేశాయని నెహ్రూ ఆరోపించారు.  వైసీపీ రౌడీయిజం చేస్తే చూస్తూ కూచోవడానికి తాము గాజులు తొడుక్కుని లేమని ఆయన హెచ్చరించారు. మీరు రౌడీయిజం పంథా ఎంచుకుంటే మేము కూడా అదే పంథా లో నడవాల్సి వస్తుంది. అదే కనుక జరిగితే టీడీపీ రౌడీయిజాన్ని వైసీపీ తట్టుకోలేదు అంటూ నెహ్రూ హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధి చేయడం చేతకాని వాళ్లు... ఇలా ప్రజల గొంతు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం ద్వారా నిలబడేందుకు ప్లాన్ చేస్తున్నాయన్నారు.