వైసీపీ ఎంపీ కలకలం... జగన్ కి దెబ్బ ఖాయం

August 07, 2020

జగన్ పై రాజుల నుంచే మొదటి దెబ్బ పడేలా కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలుగు భాషతో జగన్ పై వెళ్లగక్కిన అసంతృప్తి ఇంకా చల్లారలేదు. తెలుగు భాషను ఎవరు తక్కువ చేసినా ఊరుకోను అని జగన్ నే నేరుగా వ్యతిరేకించారు రఘురామ కృష్ణం రాజు. అపుడే వ్యవహారం ఏదో  తేడాగా ఉన్న విషయం అందరికీ అర్థమైంది. అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా గౌరవించారు రఘురామ. ఇంకోసందర్భంలో మోడీని నేరుగా కలిశారు రఘురాముడు. ఇది కూడా జగన్ కి నచ్చలేదు. వెంటనే పిలిపించుకుని మాట్లాడాడు. ఆయన గతంలో బీజేపీ మనిషే. కాబట్టి పాత పరిచయాలు ఇంకా ఉన్నాయి. ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరి నాగబాబు ను ఓడించి గెలిచారు. ఈ పలు సంఘటనలతో ఆయన పార్టీ మారతారు అని ప్రచారం గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో.. తాజా గా మరో సంచలనానికి తెరతీశారు రఘురాముడు. 

బుధవారం ఎంపీలకు ప్రత్యేక విందు ఏర్పాటుచేసిన రఘురామకృష్ణంరాజు అందరినీ ఆహ్వానించారు. దీనికి బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ తో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతరపార్టీ ఎంపీలు హాజరయ్యారు. దీంతో అతను పార్టీ మారడం ఖాయం అనే విషయం మరోసారి రుజువైంది.