పాల్ పిచ్చోడా... ఈ వీడియో చూసి చెప్పండి

May 25, 2020

కేఏ పాల్... తెలుగు మీడియాకు ఎన్నికల ప్రచారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అతను చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. ఆయన యాక్షన్లు ఏమో అందరికీ చిలిపిగా అనిపించాయి గాని... అభ్యర్థులను చూసి వైసీపీ గడగడలాడిపోయింది. అసలు బీజేపీ కంటే పాల్ కే సులువుగా అభ్యర్థులు దొరికారు. కానీ గాల్లో బాక్సింగులు, ఓటేసి జంపింగ్ చేయడం, నామినేషన్ వేసి అల్లరి చేయడం వంటి పనుల వల్ల అతన్ని జనం లెక్కలోకి తీసుకోలేదు. కానీ అతను లేకుండా ఏ టీవీ ఛానెల్ కి ఒక్కరోజు కూడా గడవలేదు.
అయితే... పాల్ అందరికీ ఒక కామెడీ పీస్ అనిపిస్తారు గాని అతని చరిత్ర అసామాన్యమైనది. అతని విజ్హానం అసాధారణమైనది... తెలుగు నేలలో పుట్టిన ఓ పేద వ్యక్తి ప్రపంచం తన ముందు సాగిలపడే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే... పాల్ స్థాయిని తెలుగు వారు ఎవరూ ఇప్పటికీ అందుకోలేదు.
అతని సత్తాకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వాటిలో ఒక ఉదాహరణ మీకోసం...ఇది పాత వీడియోనే గానీ వైరల్ అయ్యింది.